రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థను సందర్శించిన వియత్నాం ఉన్నతాధికారుల బృందం

తమ దేశానికి నాణ్యమైన విత్తనోత్పత్తి మరియు విత్తన నిలువలో సాంకేతిక పరిజ్ఞానం మరియు సహాయ సహకారలందించాలని వియత్నాం దేశ బా-రియా-వుంగ్-తౌ (BRVT) జాతీయ అసెంబ్లీ ప్రతినిధుల బృందం నాయకురాలు కోరారు. సోమవారం రోజు వియత్నాం ఉన్నతాధికారుల బృందం నాలుగు రోజుల పర్యటనకై హైదరాబాద్ చేరుకున్న ప్రతినిధి బృందం సోమవారం రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ C. పార్థసారథి, IAS గారితో సమావేశమైంది. వ్యవసాయాభివృద్ధి; పరిశ్రమలు, వ్యాపారం; విత్తన శాస్త్ర సాంకేతిక రంగంలో పెట్టుబడులు మరియు సహకారానికి గల అవకాశాలను అన్వేషించి అందిపుచ్చుకోవటానికి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నట్లు పది (10) మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహిస్తున్న శ్రీమతి గుయెన్ తి యెన్ తెలిపారు. ఈ బృందంలో ఆయా విభాగాల అధిపతులు సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ నిర్వహించిన పలు అంతర్జాతీయ విత్తన నాణ్యత అవగాహన సదస్సుల గురించి తెలుసుకొని తమకు నాణ్యమైన విత్తనోత్పత్తిపై శిక్షణ అందించాలని కోరారు. తమ దేశంలో గాలిలో అధిక తేమ మూలంగా విత్తన నిల్వ అతిపెద్ద సమస్యగా ఉందని పేర్కొన్నారు. విత్తన పంటల కోత అనంతర విత్తన నాణ్యతా పరిరక్షణ, విత్తన నిల్వలపై నైపుణ్యాభివృద్ధికై శిక్షణ అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన సామాజిక, ఆర్ధిక ప్రగతికి మంత్ర ముగ్దులయ్యామని చెప్పుతూ, తెలంగాణ భారత దేశ “”సీడ్ కాపిటల్’” కావడం గర్వకారణమని; తమ దేశానికి నాణ్యమైన విత్తనోత్పత్తికి, సురక్షితమైన విత్తన నిల్వకు అవసరమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన బదిలీ మరియు నైపుణ్య పెంపుదలకు శిక్షణ అందించాలని కోరినారు. భారత దేశంలో విత్తన ధృవీకరణ తప్పనిసరి కాదని తెలుసుకున్న బృందం వియత్నాంలో మాత్రం విత్తన తనిఖీలు, ధృవీకరణ లేనిదే విత్తన సరఫరా జరుగదని, తమ దేశంలో విత్తన నాణ్యత నియంత్రణ ఖచ్చితంగా అమలు జరుగుతోందని తెలిపారు. తమ అవసరాల నిమిత్తం విత్తనాన్ని అమెరికా, ఐరోపా దేశాలనుండి దిగుమతి చేసుకుంటున్నామని, నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణ రాష్ట్రం ప్రసిధ్ధని తెలుసుకొని విత్తన శాస్త్ర సాంకేతిక రంగంలో పెట్టుబడులు మరియు సహకారానికి గల అవకాశాలను అన్వేషించి తగు ఒప్పందాలు చేసుకొటానికి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నట్టు చెప్పారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర విత్తన  సేంద్రీయ ధృవీకరణ సంస్థలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ C. పార్థసారథి, IAS భారత దేశ, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రoలో గల విత్తన పరిశ్రమ, అన్ని దేశాలకు కావలసిన అన్ని పంటల నాణ్యమైన విత్తనోత్పత్తి, సరఫరాకు గల అనుకూల నేలలు, వాతావరణ పరిస్థితుల గురించి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. ఈజిప్ట్, ఫిలిప్పీన్స్, రష్యా, ఇటలీ తదితర పలు దేశాలకు 20 పైగా పంటల విత్తనాలను ఎగుమతి చేస్తున్నామని తెలుపుతూ వియత్నాం సహా ప్రపంచ దేశాలకు కావలసిన అన్ని రకాల పంటల నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసి ఎగుమతి చేయటానికి సిద్ధంగా ఉందన్నారు.వియత్నాం దేశానికి కావలసిన అన్నివిధాల శాస్త్ర, సాంకేతిక సహకారమందిస్తామన్నారు. వచ్చే సంవత్సరం (2019) జూన్ 26 నుండి జూలై 3 వరకు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న 32వ ISTA సదస్సుకు రావాలని వియత్నాం ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు. తమ దేశం OECD విత్తన పథకాలలో భాగస్వామి కాదని, ISTAలో సభ్యత్వం లేదని బృందo తెలుపగా ISTA కార్యనిర్వాహక కమిటీలో సభ్యత్వం ఉన్న రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ సంచాలకులు డాII కే.కేశవులు స్పందిస్తూ అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం (ISTA) లో సభ్యత్వంతో సహా OECD లో భాగస్వాములు కావటానికి సహకారమందిస్తామన్నారు.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర విత్తన సేంద్రీయ ధృవీకరణ అథారిటి ఉప సంచాలకులు శ్రీ జి.సుదర్శన్, రవీందర్ రెడ్డి, భాస్కర్ సింగ్ మరియు APEDA మేనేజర్ శ్రీ సుధాకర్ లు పాల్గొన్నారు.

c.pardhasradhi 1     c.pardhasaradhi 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *