Breaking News

రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు: వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి

రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు: వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి

సీఎం కేసీఆర్ సంకల్పానికి ఆ ఆదిశంకరుడి కృపా కటాక్షాలు తోడుగా బంగారు తెలంగాణలో ఆయు: ఆరోగ్య తెలంగాణ ఆవిర్భావం జరిగి తీరుతుందన్నారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి. మహా శివరాత్రి పర్వదిన శుభ సందర్బంగా ఆయన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. లింగోద్భవ కాలమున కోరిన కోరికలు ఆది శంకరుడు తీరుస్తాడని ప్రతీతి అన్నారు. ఆ శివుని అనుగ్రహం తో ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ అవుతాయన్నారు. సీఎం కేసీఆర్ పాలన దిగ్విజయంగా కొనసాగాలని భగవంతున్నీ మనసారా వేడుకొంటున్నానని ఆయన చెప్పారు.  ఈ పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్ద లతో జరుపుకోవాలని కోరారు. వారు చేసే ఉప వాస దీక్షతో సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఆయు: ఆరోగ్యాలు సిద్దించి, ఆరోగ్య తెలంగాణ అవిర్భవించాలని మంత్రి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *