రాష్ట్ర, జిల్లా స్థాయిలలో పోస్టుల కేటాయింపు

జోనల్ వ్యవస్ధ రద్దు నేపధ్యంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలలో పోస్టుల కేటాయింపు పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ చందా తెలిపారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర, జిల్లా స్థాయి పోస్టుల విషయమై జి.ఏడి ముఖ్యకార్యదర్శి శ్రీ అధర్ సిన్హాతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో జోనల్ పోస్టులను రద్దు చేసి ఉద్యోగవ్యవస్ధలో రెండంచెల విధానమైన రాష్ట్ర, జిల్లా స్ధాయిలోనే పోస్టులు ఉండాలన్న విషయంపై శాఖాధిపతుల అభిప్రాయాలను సేకరించనున్నట్టు తెలిపారు. జోనల్, మల్టీజోనల్ స్ధాయిలలోఉన్న పోస్టులను రాష్ట్ర స్థాయిలో చేర్చాలని సూచించారు.వ్యవసాయం & సహకార, పశుసంవర్ధక శాఖ, న్యాయ శాఖ , జి.ఏ.డి. , ప్రణాళిక శాఖ,యస్.సి డెవలప్ మెంట్, గిరిజన సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, బిసి సంక్షేమం,పరిశ్రమల శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, ఆర్ధిక శాఖ, పరిశ్రమలు, విద్యా శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, నీటిపారుదల శాఖ, హోం శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ &పట్టణ అభివృద్ధి శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, రెవెన్యూ శాఖ, యువజన అభ్యుదయం, పర్యాటక మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖలలోని పోస్టులపై ఈ సమావేశంలోసమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ మిశ్రా,ముఖ్యకార్యదర్శులు శ్రీ జయేష్ రంజన్, శ్రీ అశోక్ కుమార్ , కార్యదర్శులు శ్రీ శివశంకర్,శ్రీ జగదీశ్వర్, శ్రీ మహేష్ దత్ ఎక్కా, శ్రీ సయ్యద్ ఓమర్ జలీల్ వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *