రాష్ట్ర కాంగ్రెస్ ప్రక్షాళన దిశగా అధిష్టానం

హైదరాబాద్, ప్రతినిధి: తెలంగాణ ఇచ్చినా విజయం దక్కని కాంగ్రెస్ లో అంతర్మథనం మొదలైంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రక్షాళనకు హైకమాండ్ సిద్దమవుతోందా..? గాడి తప్పిన పార్టీ ఆపరేషన్ కు హైకమాండ్ ఏప్రిల్ నెలను ముహూర్తంగా ఎంచుకుందా..? అంటే పార్టీ వర్గాలనుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఇటు దిగ్విజయ్ రిపోర్ట్, మార్చ్ లో జరిగే ఏఐసీసీ మేథోమధనం తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ లో భారీ మార్పులు జరుగుతాయన్న చర్చ జరుగుతోంది

ఏప్రిల్ లో ఆపరేషన్
ఇన్ని రోజులనుంచి రాష్ట్ర కాంగ్రెస్ లో మార్పులుండబోతున్నాయని ప్రచారం జరిగినా… ఏప్రిల్ లో ఆపరేషన్ కు ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్రమిచ్చినా అధికారం చేజారడం… లీడర్స్ మధ్య కంప్లైంట్స్ పెరిగిపోవడంతో పరిస్థితిని చక్కదిద్దాలని డిసైడైంది హైకమాండ్. ఈ సిచ్యుయేషన్ లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్…. మూడు రోజుల టూర్ కోసం హైదరాబాద్ వస్తుండడం ఇంట్రస్టింగ్ గా మారింది. సీనియర్ నేతలు, కార్యకర్తలతో చర్చించేందుకే డిగ్గీ రాజా ఈనెల 20న రాష్ట్రానికి వస్తున్నట్లు నేతలు చెబుతున్నారు.

క్యాడర్ లో కూడా…
ముఖ్యనేతలపై ప్రజల్లోనే కాదు, పార్టీ క్యాడర్ లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధినేత్రి సోనియాకు కూడా లీడర్స్ తీరుపై చాలా కంప్లైంట్స్ వెళ్లాయి. దీంతో మేడమ్ ఆదేశాల మేరకే దిగ్విజయ్ స్టేట్ కు వస్తున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఆసరాగా చేసుకొని నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటంపై హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా హైకమాండ్ పార్టీ ప్రక్షాళనకు పూనుకోవటాన్నిక సీనియర్లు స్వాగతిస్తున్నారు.

 దిగ్విజయ్, పొన్నాల కూడా?
ప్రక్షాళన అంటే ఏ స్థాయిలో ఉంటుందన్న ఆసక్తి పార్టీ వర్గాల్లో కనబడుతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ ను ఏప్రిల్ లో మార్చే ఛాన్సుందని ఇన్ సైడ్ టాక్. ఏప్రిల్ నాటికి ప్రస్తుత పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బాధ్యతలు చేపట్టి యేడాది పూర్తవుతోంది. ఆయన విషయంలో కూడా ఢిల్లీ పెద్దలు ఇప్పటికే ఒక డెసిషన్ కు వచ్చినట్టు హైకమాండ్ కు దగ్గరగా ఉండే కొందరు నేతలు చెబుతున్నారు. ఏప్రిల్ లో జరిగే పార్టీ ప్రక్షాళన తర్వాత పార్టీలో కొత్తదనం కనిపిస్తుందని సీనియర్లు అంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.