రాష్ట్ర ఆర్థిక క‌మిష‌న్ ఆవిర్భావ ప‌రిచ‌య స‌ద‌స్సులో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

రాష్ట్ర ఆర్థిక క‌మిష‌న్ ఆవిర్భావ ప‌రిచ‌య స‌ద‌స్సులో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

దేశానికే ఆద‌ర్శంగా  తెలంగాణా ఆర్థిక క‌మిష‌న్ ప‌నిచేయాలి

స్థానిక సంస్థ‌ల‌ను ఆర్థికంగా బ‌లోపేతం చేసే దిశ‌గా స‌ల‌హాలివ్వాలి

ఆర్థిక మంత్రి, క‌మిష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వులు రెండూ బీసీల‌కే ఇవ్వ‌డం అభినంద‌నీయం

కేసీఆర్ గారు బీసీల ప‌క్ష‌పాతి అన్న శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ స్వామిగౌడ్‌

సీయం ఉంచిన న‌మ్మ‌కాన్ని నిలుపుకునేలా ప‌నిచేస్తాన‌న్న ఫైనాన్స్ క‌మిష‌న్ చైర్మ‌న్ రాజేశం గౌడ్‌

హైద‌రాబాద్‌-దేశానికే ఆద‌ర్శంగా తెలంగాణా ఆర్థిక క‌మిష‌న్ ప‌నిచేయాల‌ని పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. ర‌వీంద్ర‌భార‌తిలో  రాష్ట్ర ఆర్థిక క‌మిష‌న్ ఆవిర్భావ ప‌రిచ‌య స‌ద‌స్సు (inaugural interaction conference) ఆదివారం ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆర్థిక క‌మిష‌న్ చైర్మ‌న్ రాజేశం గౌడ్‌, స‌భ్యుడు చెన్న‌య్య‌ల‌ను జిల్లాల నుండి త‌ర‌లివ‌చ్చిన స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధులు ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మాట్లాడుతూ, మంత్రిగా, జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా విశేష అనుభ‌వం ఉన్న రాజేశంగౌడ్‌ను ఆర్థిక క‌మిష‌న్ చైర్మ‌న్‌గా సీయం కేసీఆర్ నియ‌మించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. రానున్న బడ్జెట్‌లో స్థానిక సంస్థ‌ల‌కు నేరుగా నిధులు ఇచ్చేందుకు సీయం కేసీఆర్ ఆలోచ‌న చేస్తున్నార‌న్నారు. స్థానిక సంస్థ‌ల‌ను ఆర్థికంగా ప‌రిపుష్టం చేసేలా క‌మిష‌న్ స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని కోరారు. మూడున్న‌ర ఏళ్ల‌ల్లోనే టిఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎన్నో సంక్షేమ కార్య‌క్రమాల‌ను అమ‌లు చేసి దేశం దృష్టిని ఆక‌ర్శించింద‌న్నారు. ఇదే త‌ర‌హాలో ఆర్థిక క‌మిష‌న్ కూడా త‌న ప‌నితీరుతో దేశానికి ఆద‌ర్శంగా మారుతుంద‌నే ఆశాభావాన్ని మంత్రి జూప‌ల్లి వ్య‌క్తం చేశారు. శాస‌న మండ‌లి చైర్మ‌న్ స్వామిగౌడ్ మాట్లాడుతూ, ఆర్థిక క‌మిష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఆశామాషీ కాద‌ని…అయితే ఇది లోన్‌లు ఇస్తుంద‌నే అపోహ‌లో చాలామంది ఉన్నార‌న్నారు. ఆర్థిక క‌మిష‌న్ ఎలాంటి రుణాల‌ను ఇవ్వ‌ద‌ని..ప్ర‌భుత్వం కేటాయించిన నిధుల‌ను స‌ద్వినియోగం జ‌రిగేలా ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తుంద‌న్నారు.

ఇంత‌టి గురుత‌ర బాధ్య‌త‌ను ఎంతో అనుభ‌వం ఉన్న రాజేశం గౌడ్‌కు సీయం కేసీఆర్ అప్ప‌గించార‌న్నారు. అటు ఆర్థిక మంత్రిగానూ, ఇటు ఆర్థిక క‌మిష‌న్‌ చైర్మ‌న్‌గాను బీసీల‌కే అవ‌కాశం క‌ల్పించ‌డం ద్వారా బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల‌పై త‌న‌కున్న ప్రేమ‌ను సీయం చూపార‌ని కొనియాడారు. మ‌రో మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మాట్లాడుతూ..తాము యువ‌కులుగా ఉన్న‌ప్పుడే మంత్రిగా ప‌నిచేసిన అపార అనుభ‌వ శాలి రాజేశం గౌడ్ అని… సీనియ‌ర్ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌హ‌కారంతో ఆర్థిక క‌మిష‌న్ చైర్మ‌న్ బాధ్య‌త‌ల‌ను ఆద‌ర్శంగా నిర్వ‌హిస్తార‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం  చేశారు.  ఆర్థిక క‌మిష‌న్‌ చైర్మ‌న్  రాజేశం గౌడ్ మాట్లాడుతూ…త‌న‌పై సీయం కేసీఆర్ ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేయ‌కుండా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తానన్నారు. ప్ర‌జ‌ల సొమ్మును స‌ద్వినియోగం చేసే ల‌క్ష్యంతో ప‌నిచేస్తాన‌న్నారు. త‌న‌ను అభినందించేందుకు వివిధ జిల్లాల నుండి త‌ర‌లివ‌చ్చిన స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో బీసీ క‌మిష‌న్ చైర్మ‌న్ బీఎస్ రాములు, స‌భ్యుడు వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్‌, ఎమ్మెల్సీలు గంగాధ‌ర్‌గౌడ్‌, రాములు నాయ‌క్‌, ఎమ్మెల్యే శ్రీ‌నివాస్‌గౌడ్‌, వివిధ కార్పొరేష‌న్ల చైర్మ‌న్‌లు బాపురెడ్డి, రాకేశ్‌, ధ‌ర్మ‌పురి దేవ‌స్థాన క‌మిటీ చైర్మ‌న్ ఎల్లాల శ్రీ‌కాంత్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

jupalli krishna rao 2     jupally krishna rao 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *