
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర్ర సమాచార పౌర సంబంధాల శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా జాయింట్ డైరెక్టర్ సుజాత, ప్రధాన కార్యదర్శిగా జాయింట్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లేలు ఎన్నికయ్యారు. కాగా సమాచార పౌర సంబంధాల శాఖలో కరీంనగర్ డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా పనిచేయుచున్న సిరిసిల్ల కనకయ్య సంఘంలో ఇసి మెంబర్ గా ఎన్నికయ్యారు. హైదరాబాద్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేటు సమావేశ మందిరంలో జరిగిన రాష్ట్ర్ర తెలంగాణ గెజిటెడ్ అధికారులు కేంద్ర సంఘం సెక్రటరి డా. బేగ్, హైదరాబాద్ జిల్లా తెలంగాణ అధికారుల సంఘం అధ్యక్షులు ఎం.బి. కృష్ణ యాదవ్ పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర్ర సమాచార పౌర సంబంధాల శాఖ, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులుగా జాయింట్ డైరెక్టర్ జి.సుజాత, జనరల్ సెక్రటరిగా జాయింట్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా నుండి డివిజనల్ పౌర సంబంధాల అధికారి సిరిసిల్ల కనకయ్య రాష్ట్ర్ర పి.ఆర్.ఓ. సంఘంలో ఇసి మెంబర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇసి మెంబర్ గా ఎస్. కనకయ్య ఎన్నిక అయినందున ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ బి. రాజమౌళి, జిల్లా పౌర సంబంధాల అధికారి డి.వి.జె.ఎ.వి. ప్రసాద్, ఎ.పి.ఆర్.ఓ. ఎం.ఎ. గౌస్, ఎ.వి.యస్. యం. చంద్రయ్య, సీనియర్ అసిస్టెంట్ విశ్వేశ్వర్ రావు, తెలంగాణ ప్రచార సహయకుల కేంద్ర సంఘం జనరల్ సెక్రటరీ చింతల శ్రీనివాస్, కె.రమేష్, ఉర్దూ అనువాదకులు నయిమొద్దీన్ అహ్మద్, టైపిస్టులు పి.రామారావు, చెన్నోజ్వల శ్రీధర్ స్వామి, రికార్డ్ అసిస్టెంట్ బి.శంకరయ్య, ఆఫీస్ సబార్టినేటులు, జిల్లా పాత్రికేయులు కనకయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.