రాష్ట్ర్ర జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో మైలు రాయిగా నిలిచిన మండల కేంద్రాల్లో ధర్నాలు

రాష్ట్ర్ర జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో మైలు రాయిగా నిలిచిన మండల కేంద్రాల్లో ధర్నాలు
టియుడబ్ల్యుజె (ఐజెయు) పిలుపుకు అపూర్వ స్పందన
518 మండలాల్లో కదం తొక్కిన కలం కార్మికులు 15 వేల మందికి పైగా ఆందోళనల్లో పాల్గొన్నట్లు అంచనా
మద్దతు పలికిన రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు
రాష్ట్ర్ర ఆర్ధిక మంత్రికి సంగారెడ్డిలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించిన సంఘ ప్రతినిధులు
జర్నలిస్టుల ఆందోళనపై రాష్ట్ర్ర వ్యాపిత చర్చ
ఇంటిలిజెన్సు వర్గాల ద్వారా ప్రభుత్వం ఆరా

జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో మైలు రాయిగా నిలిచే పోరాటాన్ని తెలంగాణ రాష్ట్ర్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం చేపట్టడం అభినందనీయం. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ
రాష్ట్ర్ర జర్నలిస్టులోకం వెలుగెత్తి చాటింది. టియుడబ్ల్యుజె (ఐజెయు) ఇచ్చిన పిలుపుకు జర్నలిస్టుల నుంచి ఇంతటి స్పందన వస్తుందని బహుశ నాయకత్వం కూడా ఊహించి ఉండకపోవచ్చు. కొద్దో గొప్పో తప్ప
దాదాపు రాష్ట్ర్రంలోని అన్ని మండలాల్లో జర్నలిస్టులు స్పందించారు. ఇండ్లు, ఇళ్ళ స్ధలాలు కావాలని నినదించారు. ఎమ్ పెనాల్ పేరుతో పత్రికలను ఎ,బి,సి,డిలుగా వర్గీకరించి అక్రిడిటేషన్లను కొందరికే ఇచ్చేందుకు చేస్తున్న విధానాన్ని తప్ప పట్టారు. దానికోసం తెచ్చిన జి.ఓ 239ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యకార్డులు ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని నినదించారు. నాటి తెలంగాణ ఉధ్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జర్నలిస్టులకు ఇచ్చిన వాగ్దానాలు టిఆర్ యస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హమీలు నెరవేర్చకపోవడం పట్ల జర్నలిస్టు లోకం గుర్రుగా ఉంది. కాదు ఆగ్రహంగా ఉంది. ఆ ఆగ్రహం సెప్టెంబర్ 26న తహశీల్దార్ కార్యాలయాల ముందు జరిగిన ఆందోళనల్లో వెల్లడైంది. సంఘం ఇచ్చిన పోలికేకకు జర్నలిస్టులు అనునువ్యంగా స్పందించారు. జోరున కుండపోత వర్షాలు పడుతున్న లెక్కచెయ్యలేదు. రాష్ట్ర్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కలం కార్మికులు కధంతొక్కారు. ప్రదర్శనలు నిర్వహించారు. దర్నాలు చేశారు. తహశీల్దార్లుకు వినతి పత్రాలు ఇచ్చారు. మా  న్యాయమైన సమస్యలు పరిష్కరించండని జర్నలిస్టులోకం ఇంత పెద్దన రోడ్డు ఎక్కడం ఉద్యోగవర్గాలను సైతం ఆలోచింపజేసింది. రాజకీయపార్టీలు సైతం జర్నలిస్టుల ఆందోళనకు వచ్చిన స్పందనపై చర్చించుకుంటున్నాయి. సమస్యను పరిష్కరించాలని లేకపోతే నష్టం జరుగుతుందనే అభిప్రాయం టిఆర్ఎస్ శ్రేణులనుంచి కూడా వ్యక్తం కావటం చూస్తుంటే ఉద్యమ బలం ఎంతటిదో అర్దం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర్రం ఏర్పడిన తరువాత రెండవసార  అధికారంలోకి వచ్చిన కేసిఆర్ ప్రభుత్వానికి తొలిసారి జర్నలిస్టులు షాక్ ఇచ్చారు. హక్కుల సాధన కోసం కధం తొక్కారు. టియుడబ్ల్యుజె ఐజెయు ఇచ్చిన పిలుపుకు అపూర్వ స్పందన సర్వత్ర చర్చనీయాంశమైంది.

తమనురాష్ట్ర్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం ఉన్న జర్నలిస్టులకు, రాష్ట్ర్రంలో 584 మండలాలు ఉండగా 518మండల కేంద్రాల్లో ఆందోళనలు చేయడం చిన్న విషయంకాదు. రాజకీయాలకు అతీతమైన ఒక జర్నలిస్టు సంఘంఇచ్చిన పిలుపుకు ఇంతటి స్పందన రావటం బహుశా జర్నలిస్టు ఉద్యమ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టంగా మిగిలిపోతుందనే అబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బహుశా జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో ఎన్నడు జరగనివిధంగా మొదటి సారిగా జర్నలిస్టులోకం ముక్త కంఠంతో రాష్ట్ర్ర ప్రభుత్వ చర్యలను ఖండించింది. దీనికి టీఆర్ యస్ యేతర పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర్ర వ్యాప్తంగా 15వేల మందికి పైగా ఈ ఆందోళనల్లోపాల్గొన్నట్లు ఒక అంచనా. జర్నలిస్టుల నుంచి ఈ ప్రభుత్వం మీద ఇంతటి తీవ్ర వ్యతిరేకత ఎందుకు వచ్చిందనే అభిప్రాయాలను టీఆర్ యస్ వర్గాలు సైతం వ్యక్తం చేస్తున్నాయి. జర్నలిస్టులకు కేసీఆర్ అధికారంలోకి రాకముందే2014 ఎన్నికల ప్రణాళికలో కొన్ని వాగ్దానాలు చేశారు. అందులో జర్నలిస్టులందరికి ఇండ్లు, ఇళ్ళ స్ధలాలు ఇస్తామన, అందరికి అక్రిడిటేషన్లు, ఉచిత వైద్యం అందిసస్తామని చెప్పారు. జర్నలిస్టులందరు ఉద్యమ నాయకుడుగా బావిస్తున్నకేసీఆర్ మాటలకు తిరుగుండదని భావించారు. కాని అందుకు విరుద్ధంగా ఆయన చర్యలు ఉండటంపై యావత్తు జర్నలిస్టులోకం ఆగ్రహంగా ఉంది. ముఖ్యమంత్రి మాటమీద నిలబడలేదని, ప్రభుత్వం మాయ మాటలతో జర్నలిస్టులనుసైతం మోసం చేస్తుందనే భావన ఉంది. ఎన్నిసార్లు జర్నలిస్టు సంఘాల నాయకులు స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి విన్నవించేందుకు ప్రయత్నించినా ఆయన అందుకు సముఖత చూపలేదు. దశల వారీ ఆందోళనలకు ముందు కూడా ముఖ్యమంత్రిని కలిసి ఇచ్చిన వాగ్ధానాలను, అవి అమలుకు నోచుకోకపోవటాన్ని గుర్తుచేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికలకు ముందు హైదరాబాద్ లో జరిగిన జర్నలిస్టుల గర్జనతో ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలపై ఒక
విధాన నిర్ణయాన్ని తీసుకుంటుందని జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులు సైతం భావించారు. కలెక్లర్ల సమావేశంలో దీనిపై ముఖ్యమంత్రి ఒక డైరెక్షన్ ఇస్తారని అనుకున్నారు. అది జరగలేదు. జర్నలిస్టుల గోడు వినేందుకు, మొర ఆలకించేందుకుసైతం కేసీఆర్ కు మనసు రాలేదు. రోడ్డెక్కిన వేలాది మంది జర్నలిస్టులు తెలంగాణ బిడ్డలు కారా? అనే ప్రశ్నలు సైతం వస్తున్నాయి. మన రాష్ట్ర్రం మన పాలన అన్నారు. మన పాలన బంగారుమయం అవుతుందని జర్నలిస్టులు సైతం భావించారు.

ఉమ్మడి రాష్ట్ర్రంలో అందరికి అక్రిడిటేషన్లు, ఇళ్ళస్ధలాలకోసం 242, 243 జి ఓలు ఇచ్చినా అవి బతికున్నాయో లేదో తెలియని స్ధితి. ఇక జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు వెల్ నెస్ సెంటర్లు పెట్లారు. వాటిని డల్ నెస్సెంటర్లుగా చేసి అవి పనిచేయకుండా చేశారు. ఇచ్చిన ఆరోగ్యకార్డులు చెల్లుబాటు కావటంలేదు. ఫలితంగా రాష్ట్ర్రంలో 250కి పైగా ఆరోగ్యకారణాలతో వైద్యం అందక చనిపోయారు. దీనిపై దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్ర్రీట్ లో ధర్నా చేస్తే ఉపరాష్ట్ర్రపతివెంకయ్యనాయుడు సంఘ నాయకులను పిలిచి సమస్యలను విన్నారు. రాష్ట్ర్ర ప్రభుత్వానికి రాశారు. కాని ఇక్కడ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకపోవటం విస్మయానికి గురిచేస్తుంది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టియుడబ్ల్యుజె ఇచ్చిన దశలవారీ ఆందోళనలో బాగంగా అక్టోబర్ 4 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోనూ, 14న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళనలకు సిద్ధమౌతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేపట్టక
తప్పని పరిస్ధితి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *