రాష్ట్ర్రంలోనే ఆరోగ్యవంతమైన జిల్లా కరీంనగర్

సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర్రంలోనే ఆరోగ్యవంతమైన జిల్లా కరీంనగర్ అని రాష్ట్ర్ర ఆర్ధిక, పౌర సరఫరాల శాఖా మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రువారం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాతృ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్ఞలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర్ర ప్రభుత్వం వైద్యానికి వేల కోట్లు ఖర్చు చేసి ఆసుపత్రులను అభివృద్ధి చేసి పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించుటకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పేద గర్భిణిలు ప్త్ర్రెవేటు ఆసుపత్రులలో ప్రసవాలు చేయించుకుంటే వేల రూపాయలు ఖర్చు అవుతుందని అట్టి ఖర్చును తగ్గించుటకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులో ఉంచామని అన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవలను ప్రజలు ఎక్కువుగా వినియోగించుకొనేవారని అదే తరహలో ఇప్పుడు ఆసుపత్రులలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీలను వేశామని, కమిటీల ఆధ్వర్యంలో ఆసుపత్రులలో అవసరమైన వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ఆసుపత్రులలో సాదారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. ప్రజలలో గతమే గొప్పదనే బావనగలదని, అదే బావన ప్రస్తుత ఆసుపత్రులపై కలిగేలా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజలందరు ప్త్ర్రెవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు పొందాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ, తల్లి గర్భంలో నున్ననాటి నుండి పుట్టిన బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండుటకు ప్రభుత్వం ప్రభుత్వం అన్ని పోషక విలువలు వున్న పౌష్టికాహరం ఇస్తున్నామని అన్నారు. గర్భిణిలకు శ్రీమంతం చేసే సాంప్రదాయం ఉందని, పేద కుటుంబాలలో గర్భిణిలు ఆర్ధిక స్ధోమత లేక శ్రీమంతానికి దూరంగా ఉంటారని, ప్రభుత్వం తరపున పేద గర్భిణిలందరికి మూడు నెలలకు ఒక్కసారి మాతృదినోత్సవం నిర్వహించి గర్భిణిలకు శ్రీమంతాలు జరుపుతున్నామని తెలిపారు. తల్లులను గౌరవించే సాంప్రదాయం మనదని, అందుకే మాతృదినోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, పార్లమెంట్ సభ్యులు బి.వినోద్ కుమార్, రాష్ట్ర్ర సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్, శాసన మండలి సభ్యులు నారాదాసు లక్ష్మణ్ రావు, బాను ప్రకాశ్ రావు, మంధని, కరీంనగర్ శాసన సభ్యులు పుట్ట మధు, గంగుల కమలాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.రాజేశం, ఆసుపత్రి సూపరింటెండెంట్ సుహసిని తదితరులు పాల్గొన్నారు.

eatela     eatela rajender

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *