Breaking News

రాష్ట్ర్రంలోనే ఆదర్శ గ్రామంగా ముష్టిపల్లి: జిల్లా కలెక్టర్

రాష్ట్ర్రంలోనే ఆదర్శ గ్రామంగా ముష్టిపల్లి: జిల్లా కలెక్టర్

కరీంనగర్: రాష్ట్ర్రంలోనే ఆదర్శ గ్రామంగా ముష్టిపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. శక్రువారం జిల్లా కలెక్టర్ దత్తత గ్రామం ముష్టిపల్లి లో జరిగిన గ్రామ సభకు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని, ప్రజల్లో చైతన్యం, బాగుపడాలనే తపన రావాలని అన్నారు. పేదరికం నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. మా ఊరిలో మద్యం వద్దని ప్రజలు ప్రతిన బూనాలన్నారు. గ్రామంలోని బెల్ట్ షాపులన్ని తీసివేయాలన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్నారు. అక్షరాస్యతతోనే మార్పు తొందరగా వస్తుందన్నారు. విద్యాపరంగా ప్రజలందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, పిల్లల సంఖ్య పెరిగితే, పాఠశాలను ఇంగ్లీష్ మీడియంగా మార్చుటకు చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్ అంతా పిల్లలతోనే అని వారి చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. గ్రామంలోని ప్రసవాలన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలని, ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్ధిక ఇబ్బందులు పడవద్దని అన్నారు. గ్రామంలోని చెత్తా, చెదారం, పనికిరాని చెట్ల పొదలను తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా వుంచాలని అన్నారు.

DSC_0036

గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో కమ్యూనిటి భవనము నిర్మిస్తామని, రూ. 5 లక్షలు మంచినీటి పధకానికి మంజూరు చేసానని, ఉపాధి కోసం పేపర్ ప్లేట్ ల తయారి యూనిట్, బేకరి యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ముద్ర పధకం, బిసి కార్పోరేషన్ తదితర ప్రభుత్వ పధకాల ద్వారా గ్రామస్తులకు ప్రయోజనం చేకూరుస్తామన్నారు. యువతను శిక్షణకు పంపాలన్నారు. గ్రామంలో లైబ్రరీ ఏర్పాటుచేస్తామన్నారు. మరుసటి సమావేశం వరకు గ్రామంలో మార్పు ఖచ్చితంగా రావాలన్నారు. పనితీరులో ప్రగతి కన్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ సంపూర్ణ అక్షరాస్యత కొరకు గ్రామంలో నిర్వహించబడుతున్న రాత్రి బడులను సందర్శించి చదువు నేర్చుకుంటున్న మహిళలతో మాట్లాడారు. ఇప్పటి వరకు అవకాశం రాలేదని, ఇప్పుడు వచ్చిన అవకాశం సద్వినియోగం చుసుకుని, అక్షరాస్యతతో అభివృద్ధి చెందాలన్నారు.

DSC_0054

ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్ సంయుక్త కలెక్టర్ డా. ఏ. నాగేంద్ర, ఎక్త్సెజ్ సూపరిండెంట్ సిహెచ్, విజయ్, సిరిసిల్ల ఆర్డీవో బి. బిక్షా నాయక్, పిడి డిఆర్ డిఏ అరుణశ్రీ, డిడి వయోజన విద్య యం. జయశంకర్, ఎడి టెక్స్ టైల్స్ వెంకటేశ్వర్లు, ఎడిఎ అరుణ్ కుమార్, సిరిసిల్ల తహసిల్దార్ శంకరయ్య, ఎంపిడివో సిహెచ్, మదన్ మోహన్, ఎంపిపి దడిగెల కమలాబాయి ఎంపిటిసి మల్లికార్జున్, సర్పంచ్ బాలయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *