రాష్ట్రాల ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది..

దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఒత్తిడి రావడంతో కేంద్ర మంత్రివర్గం సమావేశమై నీట్ ను ఈ ఏడాదికి రద్దు చేసింది.. వచ్చే ఏడాది నుంచి మాత్రం తప్పనిసరిగా నిర్వహించాలని కేంద్రం సూచించింది.కాగా ప్రైవేటు మెడికల్ కాలేజీలు,డీమ్డ్ వర్సిటీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నీట్ ద్వారానే ప్రవేశాలు నిర్వహించాలని కేంద్రమంత్రి సమావేశం అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.

కాగా నీట్ ఉందా లేదా అన్న మీమాంసతో తెలుగు రాష్ట్రాలు సహా చాలా రాష్ట్రాలు సొంతంగా ఎంసెట్ లు నిర్వహించాయి. కానీ వీటిని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు నీట్ ను వైద్యవిద్య లో విద్యార్థులకు తప్పనిసరి చేసింది. కానీ కేంద్రం వద్దకు రాష్ట్రాల అన్ని విద్యాశాఖ మంత్రులు వచ్చి సమావేశమై నీట్ ను ఈ ఏడాదికి మినహాయించాలని కోరారు.దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి నీట్ ను మినహాయించింది. వచ్చే ఏడాది నుంచి నీట్ ఉంటుందని స్పష్టం చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.