రాష్ట్రపతి ప్రణబ్ కు కేసీఆర్ పాదాభివందనం

రాష్ట్రపతి ప్రణబ్ ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్,  సీఎం కేసీఆర్ , శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ ఇతర టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అడుగడుగునా ప్రణబ్ కు కేసీఆర్ ఘన ఏర్పాట్లు చేశారు. గొడుగులను రాష్ట్రపతికి పట్టించారు.

కాగా విమానం దిగగానే ప్రణబ్ కు పాదాభివందనం చేసి కేసీఆర్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మొదటినుంచి తెలంగాణకు అనుకూలంగా ఉన్న ప్రణబ్  అంటే కేసీఆర్ కు చాలా గౌరవం. ఆయనను రాజకీయంగా గురువుగా భావిస్తారు. అందుకే ఢిల్లీ వెళ్లినా ప్రణబ్ కు పాదాభివందనం చేస్తుంటారు కేసీఆర్. ఇక్కడా అదే అభిమానం చాటుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *