రాష్ట్రంలో మ‌రో ప్లాస్టిక్ ఇండ‌స్ట్రీ క్ల‌స్ట‌ర్‌ : టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ బాల‌మ‌ల్లు

 

సిద్ధిపేట్ లేదా యాదాద్రిలో ఏర్పాటు

ప్ర‌తిపాద‌న‌ల‌పై టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ బాల‌మ‌ల్లుఎండీ న‌ర్సింహారెడ్డి చ‌ర్చ‌లు

ప్లాస్టిక్ ఇండ‌స్ట్రీ క్ల‌స్ట‌ర్ అబివ‌ద్ధిపై ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ల ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌

 

తెలంగాణ రాష్ట్రంలో మ‌రో కొత్త పారిశ్రామిక వాడ ఏర్పాటు కాబోతోంది. ప్లాస్టిక్ ఉత్ప‌త్తులకు సంబంధించిన ఈ పార్కు( క్ల‌స్ట‌ర్‌)ను సిద్ధిపేట్ లేదా యాదాద్రి జిల్లాల్లో ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. టీఎస్ ఐఐసీ ఈ ఇండ‌స్ట్రియ‌ల్ క్ల‌స్ట‌ర్‌ను ప్ర‌భుత్వ భాగ‌స్వామ్యంతో అభివ‌ద్ధి చేయ‌నుంది. ఇందుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌పై గురువారం బ‌షీర్‌బాగ్ ప‌రిశ్ర‌మ భ‌వ‌న్‌లో టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లుఎండీ ఈవీ న‌ర్సింహారెడ్డి అధికారుల‌తో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ప్లాస్టిక్ ఇండ‌స్ట్రీస్ క్ల‌స్ట‌ర్ ఏర్పాటుపై ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌లు ప‌చ్చా ఉపేంద‌ర్‌గుప్తాన‌ల్లు అశోక్‌రెడ్డి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. కాగా త్వ‌ర‌లో సిద్ధిపేట్ లేదా యాదాద్రి జిల్లాల్లో నెల‌కొల్పే ప్లాస్టిక్ ఇండ‌స్ట్రీ క్ల‌స్ట‌ర్‌లో దాదాపు 300 ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు అవ‌స‌ర‌మైన అన్నిర‌కాల మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించి క్ల‌స్ట‌ర్‌ను అభివ‌ద్ధి చేసేందుకు టీఎస్ ఐఐసీ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తోంది. ఈ క్ల‌స్ట‌ర్‌లో 300 ప్లాస్టిక్ పరిశ్ర‌మ‌ల ఏర్పాటుతో 6000 మందికి ప్ర‌త్య‌క్ష్యంగా, 15000 మందికి ప‌రోక్షంగా ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పంచాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. కాగాఈ స‌మావేశంలో నిమ్జ్ సీఈవో మ‌ధుసూద‌న్‌టీఎస్ ఐఐసీ చీఫ్ ఇంజ‌నీర్ ల‌క్ష్మీకాంత్‌రెడ్డిగుడాల భాస్క‌ర్‌త‌దిత‌ర ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లుపాల్గొన్నారు.

ప్ర‌తి జిల్లాకు క‌నీసం ఒక ఇండ‌స్ట్రీ క్ల‌స్ట‌ర్ ఏర్పాటు – టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ బాల‌మ‌ల్లు

కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న ప్లాస్టిక్ ఇండ‌స్ట్రీ క్లస్ట‌ర్ కోసం సిద్ధిపేట్ లేదా యాదాద్రి జిల్లాలు ప‌రిశీన‌లో ఉన్న‌ట్లు తెలిపారు. భూముల ల‌భ్య‌త‌ఇత‌ర‌త్రా అనువైన స‌దుపాయాల‌నుపారిశ్రామిక‌వేత్త‌ల సూచ‌న‌ల మేర‌కు ఈ రెండు జిల్లాల్లో ఏదో ఒక‌చోట ప్లాస్టిక్ ఇండస్ట్రీ క్ల‌స్ట‌ర్‌ను త్వ‌ర‌లో నెల‌కొల్ప‌తామ‌న్నారు. కొత్త ప‌రిశ్ర‌మ‌ల క్ల‌స్ట‌ర్ల ఏర్పాటుతో ప్ర‌తి జిల్లాకు క‌నీసం ఒక ప‌రిశ్ర‌మ‌ల క్ల‌స్ట‌ర్‌ను నెల‌కొల్పాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. ఈ ల‌క్ష్య‌సాధ‌న‌లో భాగంగానే కొత్తగా ప్లాస్టిక్ ఇండ‌స్ట్రీ క్ల‌స్ట‌ర్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ క‌స్ల‌ర్‌లో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు నిరుద్యోగ‌యువ‌త‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అలాగే ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ఆర్థిక స‌హాయంతో పాటు విద్యుత్‌ప‌ని యంత్రాలు,ముడిస‌రుకుపై ప్రొత్స‌హాకాల‌ను అంద‌జేస్తామ‌నిఉత్ప‌త్తుల‌కు మార్కెటింగ్ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని టీఎస్ ఐఐసీ చైర్మ‌న్ బాల‌మ‌ల్లు తెలిపారు. 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *