Breaking News

రాష్ట్రంలో ప్రజా రవాణా మరింత మెరుగు పరుద్దాం – మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

రాష్ట్రంలో ప్రజా రవాణా మరింత మెరుగు పరుద్దాం - మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

రాష్ట్రంలో ప్రజా రవాణా మరింత మెరుగు పరుద్దాం

రవాణా శాఖ ఆధునీకరణ వేగవంతం చేద్దాం

సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మహేందర్ రెడ్డి

మంత్రి మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు

హైదరాబాద్, జనవరి 1 : రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థలు మరింత మెరుగు పరుద్దామని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. కొత్త సంవత్సరం 2018 తొలి రోజు మంత్రి సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మంత్రికి ఆయన నివాసంలో రవాణా శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్టీసీ ఎండీ రమణారావు, రాష్ట్రం ఎంవీఐల సంఘం అధ్యక్ష కార్యదర్శులు పాపారావు, డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.మంత్రి చేత కేక్ కట్ చేయించారు. రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మీద , రవాణా శాఖ ఆధునీకరణ మీద కాసేపు మంత్రి , అధికారులు చర్చించారు. ఆర్టీసీని మరింత బలో పేతం చేయాలని సూచించారు. కొత్త బస్సుల కొనుగోలు తోపాటు గ్రేటర్ లో మెట్రోతో మరింత అనుసంధానం గురించి మాట్లాడుకున్నారు. అలాగే రవాణా శాఖ ఆధునీకరణ మరింత చేయాలని మంత్రి అధికారులతో అన్నారు. ప్రమాదాలు నివారించాలని చెప్పారు. ఆర్టీసీ ఈడీలు సత్యనారాయణ, రవిందర్, పురుషోత్తం నాయక్, జేటీసీలు రమేష్, డీటీసీలు ప్రవీణ్ రావు, ఎంవీఐలు, ఓఎస్డీలు సుధాకర్ రెడ్డి, కృష్ణకాంత్ తదిరులు పాల్గొన్నారు.

mahender reddy 2    mahender reddy 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *