రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు రాకుండా సమగ్రమైన యాక్షన్ ప్లాన్

 

ఓ వైపు మిషన్ భగీరథ పనులు చేస్తూనే,మరోవైపు వేసవికి రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు రాకుండా సమగ్రమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని RWS&S ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు . మిషన్ భగీరథ పనుల పురోగతిపై ఎర్రమంజిల్ లోని కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఈఎన్.సి, మార్చ్ చివరినాటికి సాధ్యమైనన్ని ఆవాసాలకు భగీరథ నీళ్లు అందించేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో చేపట్టిన తాగునీటి పథకాల పురోగతి, అమలుపై RWS&S జిల్లా ఎస్.ఈలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసారి ఎండలు ఉధృతంగా ఉండే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా నీటి వనరులను ఎంపిక చేసుకుని ఆవాసాలకు అంతరాయం లేకుండా మంచినీటిని సరఫరా చేయాలని సూచించారు. స్వఛ్చ భారత్ లో భాగంగా జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు ఎలా సాగుతున్నాయో ఈఎన్.సి అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లను ఉపయోగించడంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సురక్షిత తాగునీరు, సురక్షిత పరిసరాలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. ఆ తర్వాత మిషన్ భగీరథ పనుల పురోగతిపై జిల్లాల వారీగా సమగ్రంగా సమీక్షించారు. ఇంటెక్ వెల్ నిర్మాణాల పూర్తయినందున, ఇక పైప్ లైన్ పై మరింత దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో పైప్ లైన్ లు త్వరగా వేయాలన్నారు. హెడ్ వర్క్స్ పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయో ఈఈలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా పనులు నెమ్మదిగా జరుగుతన్నాయనిపిస్తే సంబంధిత వర్క్ ఏజెన్సీలతో మాట్లాడి లేబర్ ను పెంచేలా ఒత్తిడి తేవాలన్నారు. వర్కింగ్ ఎస్టిమేట్స్ ను త్వరగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ప్రతి ఆవాసానికి సురక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యంగా పగలు,రాత్రి తేడా లేకుండా కష్టపడి పనిచేయాలన్నారు. ఇంట్రా పనులు త్వరగా పూర్తికావడానికి సంబంధిత ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. మార్చ్ నాటికి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు భగీరథ నీటిని అందించాలన్నారు.  శివరాత్రి, ఏడుపాయల, వేములవాడ జాతరలలో భక్తుల కోసం తాగునీటి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో RWS&S ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్లు సురేష్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, కృపాకర్ రెడ్డి, ఎస్.ఈ వినోభాదేవి, కన్సల్టెంట్లు నర్సింగరావు, నందరావు, మనోహర్ బాబు, శ్రీనివాస్ రెడ్డి తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *