రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతా

రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతా

పాలకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతానని టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భాగా మహిళలు మంగళహారతులు, కోలాటం, బతుకమ్మలు, బోనాలు, డప్పుచపుళ్లతో ఘనస్వాగతం పలికారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ నాలుగేళ్లలో అనేక ప్రయోగాలకు వేదికైందన్నారు. దేశంలోనే ప్రగతి శీల రాష్ట్రంగా ఆవిర్భవించిందన్నారు. ఢిల్లీలో ఉండి పాలించేంది ప్రభుత్వం కాదని, 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేదని అన్నారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిరూపించిందన్నారు. పద్మశాలీల ఐక్యత చాలా గొప్పదన్నారు. అన్ని వర్గాలను కలుపుకుపోవాలనే లక్ష్యంతో ప్రణాళిక బద్ధంగా కేసీఆర్ ముందుకెళ్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్. సుధాకర్ రావు, ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడు నల్ల నాగిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ లో చేరికలు
విస్నూర్ గ్రామంలోని కాంగ్రెస్ కు చెందిన పలువురు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా ఎర్రబెల్లివారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆమ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నార్లపురం ఎల్లయ్య, ఉప్పలయ్య, యాదగిరి, నాగరాజు తదితరులు ఉన్నారు.

errabelli dayakar rao 1     errabelli dayakar rao 2     errabelli dayakar rao 3     errabelli dayakar rao 4     errabelli dayakar rao 5     errabelli dayakar rao 6     errabelli dayakar rao 7     errabelli dayakar rao 8

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *