
వరంగల్ రూరల్ జిల్లా: రాయపర్తి మండలంలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్…
పార్టీకి పట్టుకొమ్మలు.. కార్యకర్తలే.
లీడర్లు ఎంతమంది ఉన్నా.. కేడర్ లేని పార్టీ మనగడ కొనసాగించలేదన్నారు.
కేటీఆర్ ఆద్వర్యంలో కార్యకర్తలకు మంచి రోజులు రానున్నాయన్నారు.
ఎన్నికైన ప్రజాప్రతినిధుల కంటే.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి గెలిపించిన కార్యకర్తలే గొప్పవారన్నారు.
గెలుపొందిన ప్రజాప్రతినిధులు సంపాదన కన్నా.. ప్రజాసేవ చేయడం ద్వారానే గౌరవం పెరుగుతుందన్నారు.
తెలంగాణాలో సంక్షేమ పథకాల అమలుతో సియం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారన్నారు.
సియం కేసీఆర్ తన పనితీరుతో.. దేశంలోనే గొప్ప పేరు సంపాదించారన్నారు.
రైతులకు సాగునీరు అందించడమే ద్యేయంగా కృషిచేస్తున్న మహాత్ముడు మన ముఖ్యమంత్రి కేసీఆర్.
త్వరలోనే చెరువులకు జలకళ రాబోతుందన్నారు.
భగీరథ ద్వారా ప్రజల గొంతు తడుపుతున్న నాయకుడు సియం కేసిఆర్ అని వ్యాఖ్యానించారు.
పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందాలన్నారు.
పాలకుర్తి నియోజవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపెడతానన్నారు..
యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.