
రామోజీరావు-వైఎస్ జగన్ లు రామోజీ ఫిలిం సిటీలో కలుసుకున్నారని వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఆ మధ్య మంచు మనోజ్ పెళ్లిలో ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. రామోజీ పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకి.. టీడీపీ ఎన్టీఆర్, చంద్రబాబు ను మోస్తూ ఉన్నారు.. ఇక కాంగ్రెస్ జీన్స్ ఉన్న వైసీపీ అధినేత జగన్ కు కూడా రామోజీ అన్న ఈనాడు యాజమాన్యం అన్న కస్సున లేస్తారు..
ఇకపోతే రామోజీ ఫిలిం సిటీలు వీరిద్దరు భేటి అయ్యారట.. ఈ బేటిలో కేసీఆర్ సూచన ప్రకారమే జగన్ రామోజీని కలిసి సయోధ్య కుదిర్చారని సమాచారం.. తనకు వ్యతిరేకంగా వెళ్లవద్దంటూ.. మద్దతు కావాలని జగన్ రామోజీ ని కోరారని టాక్.. లోపల ఏం జరిగిందో తెలియదు.. కానీ వీరి భేటి ఏపీ రాజకీయాల్ని ప్రభావితం చేసేలా ఉంది.. రాజీ యత్నాల్లో చంద్రబాబు కు ఈ విషయం తెలిసి గుబులు పుట్టుకుందట..