
భూపాలపల్లి జిల్లాలోని రామప్ప దేవాలయంలో శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ ఆజ్మీరా చందూలాల్ తెలిపారు. తెలంగాణ లోని రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదలో గుర్తింపు సాధించేందుకు గాను ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని రామప్పదేవాలయంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాత్రి అంతా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, స్ధానికంగా ఉన్న ప్రజలతో పాటు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు తరలివస్తున్నందున ఏర్పాట్లు చేస్తున్నామని పర్యాటక,సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం గారు తెలిపారు. కాకతీయ హెరిటేజ్ సంస్ధ తరపున నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు శ్రీ పాపారావు గారు తెలిపారు.