హైదరాబాద్ రూపు రేఖలు మారబోతున్నాయి

talasani

హైదరబాద్: రానున్న రోజుల్లో హైదరబాద్ రూపు రేఖలు మారబోతున్నట్లు కమర్షియల్ టాక్స్ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు . బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైదరబాద్ నగరం మన రాష్ట్రానికి తలమానికమని ఈ నగరాన్ని  ప్రపంచ స్థాయి నగరంగా  అభివృద్ధి చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రస్తుత 2015-16 బడ్జెట్లో హైదరబాద్ నగరానికి  జరిగిన కేటాయింపులే అందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. హైదరబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో వుంచుకొని రోడ్ల అభివృద్దికి, మరియు ఆకాశ మార్గాల నిర్మాణానికి 1,600 కోట్ల కేటాయించామని ఇందుకు తగిన  ప్రణాళికలు రూపొందించామని, నగర  ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో వుంచుకొని 1,000 కోట్లు ప్రతిపాదించామని ఆయన తెలిపారు. హైదరబాద్లో పెరుగుతున్న జనాబా దృష్ట్యా జనాబా పరిరక్షణకు పాటుపడే పోలీస్ శాఖ అవసరాల కోసం జంట కమిషనరెట్లులో  వాహన కొనుగోలుకోసం 271 కోట్ల మంజూరు చేసామని ఇందులో బాగంగా ఇప్పటికే 3,883 వాహనాలు కొనుగోలు చేసామని ఆలాగే మిగిలిన అన్ని జిల్లాలో కొన్ని వాహనాలు కొనుగోలు చేస్తామని , హైదరబాద్ లో నివసించే ప్రతి పౌరుని రక్షించే బాధ్యత తమ ప్రభుత్వం పైన వుందని నగరం చుట్టూ లక్ష సి సి కెమెరా లు ఏర్పాటుకు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈవన్ని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసందానం అవుతాయని , అలాగే  108 సేవలను బలోపేతం కోసం వాహనాల సంఖ్య 337 నుండి 506 కు పెంచుతున్నట్లు  అయన తెలిపారు. తమ ప్రభుత్వం హైదరబాద్ నగరాన్ని విశ్వ నగరంగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి వుందని హైదరబాద్లో నివసించే ప్రతి ఒక్కరి రక్షణ బాధ్యత తమ ప్రభుత్వానిదని ప్రస్తుత బడ్జెట్లో జరిగిన కేటాయింపులు నగర ప్రజలకు వరల్లాన్టివని త్వరలో హైదరబాద్ నగర్ రూపు రేఖలు మారతాయని ఆయన పునరుద్ఘాటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *