రానాతో ఫైట్ చేస్తున్న ప్రభాస్

దిగ్గజ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న బాహుబలి2 చివరి అంకానికి చేరుకుంది. బాహుబలి 2 క్లైమాక్స్ చిత్రీకరిస్తున్న స్వయంగా రాజమౌళి ట్విట్టర్ లో వీడియోను అప్ లోడ్ చేసి తెలిపారు. ఈ క్లైమాక్స్ షూట్ లో ప్రభాస్, రానా ల మధ్య వార్ సీన్స్ ఉన్నట్టు వెల్లడించారు.

కాగా ఈ సినిమా ఆక్టోబర్ వరకు చిత్రీకరణ పూర్తి చేసి 6 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాలని చిత్రం యూనిట్ ప్లాన్ చేసింది. ఏప్రిల్ లో తెలుగు , తమిళ, మాళయాల, కన్నడ, హిందీలతో పాటు హాలీవుడ్, ఇతర భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సమాయత్త మవుతోంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియాలంటే ఖచ్చితంగా వచ్చే ఎండాకాలం వరకు ఆగాల్సిందేనన్న మాట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *