రాత్రి నౌకరీలతో షుగర్ వ్యాధి

మీరు నైట్ డ్యూటీలు చేసే జాబ్ లు చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త .. పగలు పనిచేసే వారికన్నా రాత్రి పనిచేసే వారికి తొందరగా షూగర్ (డయాబెటిస్) వ్యాధి వస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. రాత్రిపూట మేల్కొని పనిచేస్తూ పగలు నిద్రించేవారు వారు తొందరగా షుగర్ వ్యాధి బారిన పడతారట.. రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని పనిచేయడం వల్ల జీవక్రియ దెబ్బతిని ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

సౌత్ కొరియా పరిశోధకులు చేసిన పరిశోధనలో రాత్రి పూట మేల్కొని సిగరెట్ తాగడం, లేట్ నైట్ తిండి తినే వాళ్లకు డయాబెటిస్ తొందరగా సోకడంతోపాటు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయని వారు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *