రాజ్ మాదిరాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ‘ఐతే 2.0’

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రాజ్ మాదిరాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ‘ఐతే 2.0’
‘బుషి’, ‘ఆంధ్రాపోరి’ వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌తో అల‌రించిన ద‌ర్శ‌కుడు రాజ్ మాదిరాజు ద‌ర్శ‌క‌త్వంలో ‘ఐతే 2.0’ సినిమా రూపొంద‌నుంది. ఫ‌ర్మ్‌9 బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రానికి హేమంత్ వ‌ళ్ళ‌పు రెడ్డి, ర‌వి.ఎన్‌.ర‌ధి, విజ‌య్‌రామ‌రాజు నిర్మిస్తున్నారు. టెక్నో థ్రిల్ల‌ర్ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొంద‌నుంది. ఈ సినిమా గురించి ద‌ర్శ‌క‌డు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ ”ఇప్ప‌టి వ‌ర‌కు డిఫ‌రెంట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన నేను టెక్నో థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో ‘ఐతే 2.0’ చిత్రాన్ని రూపొందించ‌బోతున్నాను. ఇప్ప‌టి యూత్ ఎక్కువ‌గా మొబైల్స్‌, ల్యాప్ టాప్స్‌లోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్నారు. సోష‌ల్ మీడియాతోనే త‌మ స‌మ‌యాన్ని గ‌డిపేస్తూ ప‌రిస‌రాల‌ను కూడా ప‌ట్ట‌నట్టుగా ఉండే యువ‌త‌ను కూడా ఒక‌రు గ‌మ‌నిస్తుంటారు. వారెవ‌రు?  ఈ సోషిల్ మీడియాను అధికంగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎటువంటి అన‌ర్థాలు జ‌రుగుతాయ‌నే విష‌యాన్ని మా ఐతే 2.0 మూవీ తెలియ‌జేస్తున్నాం. ఈ కాలం యువ‌త‌కు కావాల్సిన ఓ మెసేజ్‌ను కూడా ఇందులో అందిస్తున్నాం. ఈ సినిమా టైటిల్ గురించి ఆలోచిస్తున్న‌ప్పుడు ఐతే అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న వ‌చ్చింది. గుణ్ణం గంగ‌రాజుగారితో మాట్లాడి టైటిల్ గురించి అడిగితే త‌ను అంగీక‌రించారు. అందుకే ఈ సినిమాకి ఐతే 2.0 అనే టైటిల్ పెట్టాం. సినిమా అక్టోబ‌ర్ నుండి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ స్టార్ట్ చేసుకుంటుంది. న‌టీన‌టులు వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం అన్నారు.
రాజు ముదిరాజ్

రాజు ముదిరాజ్

 
Raj Madiraju’s new film titled ‘Aithe 2.0’ 

Raj Madiraju, who earlier directed movies like ‘Rushi’, ‘Andhra Pori’ etc, is going to wield the megaphone once again for a movie titled ‘Aithe 2.0’. Dr.Hemanth Vallapu Reddy, Dr.Ravi N Rathi and K.Vijaya Rama Raju will produce this film on Firm 9 pictures banner.
Director said, “I did films with different subjects earlier. ‘Aithe 2.0’ is a techno thriller, which focuses on the ill effects of technology and social media on youth. Though the young people today are not concerned about their surroundings being immersed in social networking, some one is watching them. Who is it ? The film will discuss about it. There is a good message for youth in this movie. We took Gunnam Gannaraju’s permission to use the title. The regular shooting starts is October. We will announce the details of the cast and crew soon”.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.