
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి.. ఆ రెండు స్థానాల్లో టీఆర్ఎస్ నుంచి చాలా మంది సీనియర్లు పోటీపడుతున్నారు. ఇందులో కవిత నామినేట్ చేసిన డీ.శ్రీనివాస్ కు ఒక స్థానం ఖరారు కాగా.. రెండో స్థానం కోసం నమస్తే తెలంగాణ ఫౌండర్, మాజీ చైర్మన్ అయిన సీఎల్ రాజంతోపాటు సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కెప్టెన్ లక్ష్మీకాంతరావులు ముందున్నారు.. ఇందులో రాజాంకు సీటు గ్యారెంటీ అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి..బడా పారిశ్రామిక వేత్త సీఎల్ రాజంతో కేసీఆర్ పెట్టుబడి పెట్టించి ‘నమస్తే తెలంగాణ’ పత్రికను స్థాపింపచేశాడు. ఆ తరువాత గద్దెనెక్కగానే టీఆర్ఎస్ నమస్తే తెలంగాణ పత్రికను హస్తగతం చేసుకొంది. దీనిపై ఆగ్రహించిన ఆ పత్రిక ఎండీ కేటీఆర్, కేసీఆర్ లతో గొడవపడి బీజేపీలో చేరిపోయారు. అనంతరం టీఆర్ఎస్ పెద్దలు కేసీఆర్-సీఎల్ రాజాం ల మధ్య రాజీ కుదిర్చి మొత్తానికి నమస్తే తెలంగాణ పత్రికను కేసీఆర్ సన్నిహితులకే ఇచ్చేటట్టు రాజాంను ఒప్పించి మైత్రి కొనసాగించారు.. ఇక ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు వేళయ్యింది.రాజ్యసభలో ఖాళీ అయిన రెండు సీట్లు టీఆర్ఎస్ లో ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
గతంలో పత్రిక స్థాపించినప్పుడు సీఎల్ రాజంకు రాజ్యసభ ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. కానీ వీరిద్దరి మధ్య పత్రికకోసం విభేదాలు రావడం సమసిపోయిన నేపథ్యంలో ఆ సీటు ఇస్తారా ఇవ్వరా అన్న సందేహం కలుగుతోంది.. రాజాం పట్టుబడుతున్నప్పటికీ కేసీఆర్ హామీ నెరవేరుస్తారో లేదో చూడాలి..