రాజేంద్రనగర్ అగ్ని ప్రమాద స్థలాన్ని సందర్శించిన హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి

తెలంగాణ రాష్ట్ర హోం, కార్మిక శాఖా మంత్రి నాయిని నరసింహా రెడ్డి రాజేంద్రనగర్ పరిధిలో బుదవారం నాడు జరిగిన అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని సందర్శించారు. సంఘటనలో ఆరుగురు మృతి చెందటం పట్ల విచారం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఆరుగురులో ప్రస్తుతం నలుగురిని గుర్తించామని, మిగిలిన ఇద్దరిని గుర్తించాల్సి ఉందని తెలిపారు.
ఈ సందర్బంగా బుదవారం సాయత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు రెండు లక్షల రూపాయలను ప్రకటించమని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. అదేవిధంగా ఈ షాపు యజమాని మరో రెండు లక్షల రూపాయలు అందజేయనున్నారని , అపద్బందు పథకం క్రింద రాష్ట్రప్రభుత్వం యాబై వేల రూపాయలను , అంత్యక్రియల ఖర్చు క్రింద మరో ఇరవై వేల రూపాయలను ప్రభుత్వం అందజేయనందని హోం మంత్రి తెలియజేశారు.

About The Author

Related posts