
గులాబీకి, గడ్డిపూవుకు తేడా తెలియకుండా లవ్ చేస్తున్నారు ఈ కాలం కుర్రాళ్లు.. లవ్ అనేది అప్పట్లోలా దేవదాసు ప్రేమలా ఉండట్లేదు.. లవ్ చేయడం.. అవసరం మేరకు వాడుకోవడం.. మోజు తీరాక వదిలేయడం సర్వసధారణమైపోయింది..
అమ్మాయిలు ఈ విషయంలో సీరియస్ గా స్పందించట్లేదు.. వారు లైట్ తీసుకుంటున్నారు. మహిళల ప్రాధాన్యం ముందు జాబ్ ఉన్నవారికి.. ఆర్థికంగా బాగా సెటిల్ అయిన వారికే దక్కుతోంది.. ముందు ఎవరినో కాలేజ్ మేట్ నో.. ఆఫీసు కొలిగ్ నో ప్రేమించినా చివరాఖరుకు మంచి ఆస్తిపరుడు.. బాగా బలిసిన ఫ్యామిలీ తగిలి సంబంధం ఓకే అయితే తమ ఇన్నాళ్ల ప్రేమకు మంగళం పాడుతున్నారు ఈ కాలం యువత..
ఇప్పుడు కాలం మారింది బాసూ.. జీవితం ప్రేమతో నాశనం చేసుకోవాలా.. మంచి లైఫ్ ముందు ఉండగా.. ఎందుకు ఈ ప్రేమలు దండగ అంటున్నారు.. అందుకే ముందు గులాబీ పువ్వు ఇచ్చిన ప్రేమ గాళ్లు ఆ తర్వాత అది గడ్డి పువ్వూ అని మరిపిస్తున్నారు.