Breaking News

రాజశేఖర్ గడ్డం గ్యాంగ్ సెన్సార్ పూర్తి, 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల

gaddam-gang
డా.రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన గడ్డం గ్యాంగ్ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యు బై ఏ – (U/A) సర్టిఫికెట్ ఇచ్చారు. గడ్డం గ్యాంగ్ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ను ప్రశంసించారు. రాజశేఖర్ యాక్టింగ్ గురించి స్పెషల్ గా చెప్పడం విశేషం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా చిత్రాన్ని తెరకెక్కించారని మెచ్చుకోవడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈనెల 6న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
తమిళంలో విజయవంతమైన సూదుకవ్వమ్ చిత్రానికి రీమేకిది. జర్నీ ఫేం శరవణన్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన పి.సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శివాణి శివాత్మిక మూవీస్ పతాకంపై జీవితా రాజశేఖర్ నిర్మించారు. రాజశేఖర్ సరసన షీనా కథానాయికగా నటించింది. కామెడీ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. సంగీత దర్శకుడు అచ్చు మ్యూజిక్ అందిచడమే కాకుండా ఓ ప్రత్యేక పాత్రలో నటించడం స్పెషల్ ఎట్రాక్షన్. నోయల్, సత్యం రాజేష్, నరేష్, సీత ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *