Breaking News

రాజయ్య పోస్టు ఊస్టేనా..?

rajaiah kcr

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ తొలి ప్రభుత్వం అవినీతితో భ్రష్టుపట్టిన వైద్య ఆరోగ్యశాఖలో సీఎం ముగ్గురు అధికారులను విధుల నుంచి తొలగించారు. ఈ మొత్తం ప్రమేయంలో రాజయ్య ప్రమేయం ఉందని తెలియడం తో ఇప్పడు ఆయన పోస్టు ఊస్టేనా అన్న సందేహం వ్యక్తం అవుతోంది. మంత్రివర్గం నుంచి తొలగించవచ్చన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం తదుపరి చర్యపై చర్చ మొదలైంది.

కొత్త రాష్ట్రం ఏర్పడడం.. మెరుగైన పాలన అందించాలని సీఎం కేసీఆర్ తలపోయడంతో ఇటువంటి అవినీతి వెలుగుచూడగానే సీఎం వేగంగా రియాక్ట్ అయి వారిని తప్పించారు. కాగా వైద్య ఆరోగ్య శాఖ రాజయ్య ప్రమేయం ఉందని నిఘా విభాగం సీఎంకు నివేదించింది. దీంతో ఆయనపై వేటు పడే అవకాశంపై సీఎం సన్నిహితులతో చర్చిస్తున్నారు.

ఉపముఖ్యమంత్రి రాజయ్యను తప్పించడంపై సీఎం కేసీఆర్ సీనియర్ మంత్రులు హరీశ్, కేసీఆర్, తుమ్మల , మహేందర్ రెడ్డిలతో చర్చించారు. ఇప్పటికిప్పడు తప్పిస్తే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయని మంత్రులు చెప్పారట.. కానీ అవినీతి విషయంలో తలొగ్గవద్దని.. రాజయ్యను తప్పించాల్సిందేనని కేసీఆర్ నిశ్చయించుకున్నారని టాక్.. మొత్తం మీద అవినీతి వ్యవహారం రాజయ్య మెడకు చుట్టుకుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *