రాజయ్య టికెట్ ఇవ్వొద్దని సోనియాకు లేఖ రాసిందట..

image

వరంగల్ :  వరంగల్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ తరఫున నిలబడ్డ రాజయ్య కు వ్యతిరేకంగా ఆయన కోడలు సారిక ఏకంగా సోనియాకు లేఖ రాసిందట.. తనను ముగ్గురు పిల్లల్ని రాజయ్య ఇంటినుంచి తరిమేశారని.. అన్యాయం చేశారని లేఖలో ఫిర్యాదు చేశారు. రాజయ్య కు లోక్ సభ టికెట్ ఇవ్వొద్దని కోరిందట..

ఇదే విషయంపై టీపీసీసీ అద్యక్షులు,  ఇతర ముఖ్య నేతలకు కూడా సారిక రాజయ్యకు టికెట్ ఇవ్వవద్దని చెప్పిందట.. ఇవన్నీ సంఘటనలు ఇప్పుడు రాజయ్య మెడకు చుట్టుకున్నాయి. సారిక వ్యవహారంపై లైట్ తీసుకోవాలంటూ రాజయ్య మేడమ్ సోనియా, ఇతర ముఖ్య నేతలను ఒప్పించాడట.. టిక్కె ట్ దక్కించుకున్నతర్వాత సారిక ఇలా సజీవదహనం కావడంతో రాజయ్యపైనే అనుమానాలు రేకెేత్తుతున్నాయి..

కాగా రాజయ్య కొడుకు అనిల్ , సారికది ప్రేమ వివాహం. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత అనిల్ ఓ మైనార్టీ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని సారికను తరిమేశాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధర్నాలు చేసింది. అయినా అనిల్ మారక ఆమె నుంచి దూరంగా ఉంటోంది.. ఇప్పుడు ఆమె చనిపోవడంపై అనుమానాలు రేకేత్తుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *