Breaking News

రాజయ్య అవుట్.. కడియం ఇన్..

kadiyam srihari

-తెలంగాణ మంత్రివర్గం నుంచి రాజయ్య తొలగింపు
-మంత్రిగా కడియం ప్రమాణ స్వీకారం
హైదరాబాద్, ప్రతినిధి : డిప్యూటీసీఎం రాజయ్య కథ కంచికి చేరింది. వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి ఆరోపణలు ఆయన సీటుకు ఎసరు తెచ్చాయి. తనకు అనుభవం లేదని.. తప్పు చేస్తే ఉరేసుకుంటానంటూ సీఎం కు లేఖ రాసినా కేసీఆర్ కనికరించలేదు. అవినీతిని సహకరించనని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే స్పష్టం చేసిన కేసీఆర్.. రాజయ్య అవినీతి ఆరోపణలకు అంతే నిర్దయగా చెక్ పెట్టారు.

రాజయ్య అవినీతి ఆరోపణలు వెలుగుచూడడంతో ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని కేసీఆర్ భావించారు. దీంతో ఆయనను భర్తరఫ్ చేయాలని నిర్ణయించుకొని అమలు చేశారు. రాజయ్యను గవర్నర్ కార్యాలయం మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

అనంతరం అంతే వేగంగా సీఎం కేసీఆర్.. సీనియర్ నేత అయన కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. డిప్యూటీసీఎంగా ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజయ్య ప్లేస్ లో కడియం చేత రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ప్రమాణం స్వీకారం చేయించారు. కడియంకు కీలక విద్యాశాఖను అప్పగించారు.దాంతోపాటు డిప్యూటీసీఎం హోదా కల్పించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులందరూ హాజరయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *