
తెలుగు సినిమా స్థాయిని పెంచేలా తీసిన బాహుబలి సినిమా వల్లే ఇప్పుడు తెలుగువాళ్లను ముంబైలో.. దేశంలో గొప్పగా చూస్తున్నారని అన్నారు రవితేజ.. కిక్ 2 ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన ఆయన రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు సినిమాలన్నీ బాగా ఆడాలని అందుకే బాహుబలి, శ్రీమంతుడు లాంటి పెద్ద సినిమాల కోసమే తన కిక్ 2ను వాయిదా వేశామన్నారు.
తనకు భేషజాలు లేవని .. రుద్రమదేవి లాంటి సినిమా కూడా బాగా ఆడితేనే అందరూ బతుకుతారని అన్నారు. కాగా తాను బక్కగా అయిపోవడంపై స్పందించారు. బరువు పెరిగానని తగ్గించుకోవాలని డైటింగ్ చేస్తున్నా తప్ప తనకు ఏ రోగం లేదన్నారు.