Breaking News

రాజమౌళి తదుపరి చిత్రం మహేశ్ తో..

Vikramadithyan 2 days collection report - Onlookers Media

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తీయబోయే చిత్రం కొలిక్కి వచ్చింది. ఈ సినిమాలో ప్రిన్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించనున్నారు.  కె.ఎల్ నారాయణ నిర్మించనున్న ఈ చిత్రంపై ఇప్పటికే రాజమౌళి, మహేశ్ తో ఒప్పందం కుదిరినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాజమౌళి.

కాగా మహేశ్ తో ఓ సినిమా తీస్తానని ఎప్పటినుంచో రాజమౌళి చెబుతూ వస్తున్నారు. దీనిపై మహేశ్ రాజమౌళి కలిసి చర్చలు జరిపారు కూడా..  ఆ తర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీ అయ్యారు.  బాహుబలి 2 పూర్తయిన తర్వాత వెంటనే మహేశ్ తో సినిమా చేయనున్నట్టు రాజమౌళి ప్రకటించడం మహేశ్ అభిమానులు సంబరాల్లో ముంచెత్తింది.

మహేశ్ బాబు ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవ’ సినిమా చేస్తున్నారు. ఆ తరువాత త్రివ్రిక్రమ్ తో మరో సినిమా చేస్తారు. అనంతరం మహేశ్ రాజమౌళి సినిమా పట్టాలెక్కుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *