Breaking News

రాజమౌళి.. ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా..

maxresdefault

రాజమౌళి.. గొప్ప దర్శకుడిగానే మనకు తెలుసు కానీ.. ఆయనలో ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నాడు.. ఆయన బాహుబలి తెరకెక్కించిన విధానంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ ఆయనలో మరో కోణం కూడా ఉంది. ఆయన ఒక బిజినెస్ మ్యాన్.

తన సినిమాకు దాదాపు 200 కోట్లు పెట్టించిన దర్శకుడు. అంతపెద్దగా సినిమా రావడానికి. అంత ఖర్చు కావడానికి కారణమైన ఆయన తన సినిమాను తీసి ఊరికే ఊరుకోలేదు. దాన్ని పబ్లిసిటీ బాధ్యత కూడా తన మీదే వేసుకున్నాడు. తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషల్లో విడుదలవుతున్న బాహుబలి కోసం ఆయా రాష్ట్రాలకు వెళ్లి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ చిత్రాలతో సంబంధమున్న నటులను అందుకు ఉపయోగిస్తున్నారు. బాగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ఇటీవలే తెలుగు దినపత్రికలందరికీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలిచ్చిన రాజమౌళి, ఈరోజు అన్ని న్యూస్ చానాళ్లకు ఇంటర్వ్యూలిచ్చారు. ముంబై వెళ్లి అక్కడి సినిమా పంపిణీ దారు కరణ్ జోహార్ తో హిందీ చానాళ్లకు ఇంటర్వూలిచ్చారు. కేరళలో భారీ ఎత్తున పోస్టర్ ను ఆవిష్కరించారు. తమిళంలో నాజర్, సత్యరాజ్ తో కలిసి ప్రచార కార్యక్రమంలో టీవీలకు వెళ్లారు.

ఇలా దర్శకత్వంతో పాటు తన కళల రూపానికి పబ్లిసిటీ బాధ్యతను భూజనకెత్తుకొని ఒక మంచి బిజినెస్ మ్యాన్ అనిపించుకుంటున్నారు రాజమౌళి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *