రాజమౌళికి టీ పోలీస్ జలక్

prabhas_rajamouli_baahubali_audio_postponed_press_meet_niharonline

హైదరాబాద్ : ఈనెల 31న ఆర్భాటంగా విడుదల కావాల్సిన బాహుబలి ఆడియో ఒక్కసారిగా వాయిదా పడడానికి కారణాలు ఏమైం ఉంటాయోనన్న ఆందోళన అభిమానుల్లో రాజ్యమేలుతోంది. దీనికి రాజమౌళి , టీ పోలీసుల అత్యుత్సాహామే కారణంగా తెలుస్తోంది.

రాజమౌళి బాహుబలి ఆడియో విడుదల వేడుకను ఎంపిక చేసుకొని పోలీసుల అనుమతి తీసుకోకుండానే 31 న లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించేశారు. అనంతరం తీరిగ్గా పోలీసుల అనుమతుల కోసం వెళ్లగా.. వారు ముందు ఎందుకు తీసుకోలేదంటూ అనుమతి నిరాకరించారట..

దీనికి గోపాల గోపాల సినిమా సమయంలో తొక్కిసలాటలో అభిమాని మృతిని కారణంగా పోలీసులు చూపించారట.. మొత్తానికి బాహుబలి విడుదల జాప్యంలో రాజమౌళిది, పోలీసులది అంతే పాత్ర ఉంది. దీంతో అభిమానులకు నిరాశ తప్పలేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *