రాజమండ్రి ఇక పాతదే.. తెలంగాణ కొత్తది..

godavari

60 ఏళ్ల స్వతంత్ర సమైక్య ఆంధ్రప్రదేశ్ లో గోదావరి పుష్కరాలు అంటే కేవలం రాజమండ్రి ఘాట్ స్ఫూరణకు వచ్చేలా ఏర్పాట్లు చేసేవారు నాటి ఆంధ్రా పాలకులు.. గోదావరి  జన్మించే నాసిక్ త్రయంబేకేశ్వర్ మొదలు బంగాళఖాతంలో కలిసే అంతర్వేది వరకు గోదావరి తీరం వెంట వందల కొలదీ ప్రాచీన ఆలయాలు.. గొప్ప క్షేత్రాలు కొలువై ఉన్నాయి.. కానీ నాటి సమైక్య పాలకుల హస్వ దృష్టి కేవలం రాజమండ్రి ఘాట్ మీదకు మళ్లింది.. అందుకే తరతరాలుగా తెలంగాణ పుష్కర ఘాట్ లు నిర్లక్ష్యం చేయబడ్డాయి..

సీను మారింది..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం మొదలు.. తెలంగాణ వైభవానికి పూర్వ వైభవం కొట్టొచ్చినట్టు కనపడింది.. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక ఒరవడిని సంతరించుకొని పుష్కర స్నానాలకు గొప్పగా రెడీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు పెట్టి చేసిన పనులు దిగ్విజయం అయి తెలంగాణలో దాదాపు 6 కోట్ల మంది స్నానాలు ఆచరించారు. ఇన్నాళ్లు ఆంధ్రాకే పరిమితమైన పుష్కరాలు తెలంగాణలోని దివ్యక్షేత్రాలు బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలంకు విస్తరించి ఆంధ్రాప్రాంతం వారిని కూడా ఆకర్షించి విజయవంతం చేశాయంటే వీటి స్టామినా,, తెలంగాణ పట్టుదలకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు..

చివరగా.. కరుడగట్టిన సమైక్యవాది లగడపాటి స్వయంగా మంథని ఘాట్ లో పుష్కర స్నానం ఆచరించారు.. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ పుష్కరాలు నిర్వహించిన తీరును, చేసిన ఏర్పాట్లను వేయినోళ్ల పొగిడాడు.. చాలా మంది ఆంధ్రావాసులు నిజామాబాద్ ,బాసర, కాళేశ్వరం, ధర్మపురిలో స్నానాలాచరించి తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పారు..

ఆంధ్రా సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగై తెలంగాణ సంస్కృతి పరఢవిల్లిన పుష్కర సంరంభం తెలంగాణ నేలపై చిరస్థాయిగా మిగిలిపోతుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *