రాజన్ దొరికాడు.. దావుద్ పాక్ లో..

90వ దశకంలో ముంబైలో మారణ హోమం సృష్టించిన ఇద్దరు మాఫియా డాన్ లలో ఒకరు దొరికారు.. రెండు మతాలకు రెండు గ్రూపులు గా ప్రాతినిధ్యం వహించి అరాచకం సృష్టించిన దావుద్ ఇబ్రహీం, చోటా రాజన్ ల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా వేట కొనసాగుతోంది.. మారు వేశాలతో వీరు 20 ఏళ్లుగా తప్పించుకుతిరుగుతున్నారు.

rajan2

కాగా ఇండోనేషియా దేశంలోని బాలిలో ప్రముఖ ముంబై మాఫియా డాన్ ఛోటా రాజన్ దొరికాడు.. మోహన్  కుమార్ అనే దొంగ పాస్ పోర్టుతో ఇండోనేషియాలో దొరికిపోయాడు. ఇండోనేషియా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ వారంలోనే రాజన్ ను భారత్ కు అప్పగించేందుకు ఇండోనేషియా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 2 దశాబ్దాలుగా తప్పించుకుతిరుగుతున్న రాజన్ ఇరవై హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.

తొలినుంచి దావుద్ ఇబ్రహీంతో ఛోటా రాజన్ బద్ద వైరం కొనసాగించారు. తాజా అరెస్ట్ తో విలువైన సమాచారం రాబట్టి మిగితా నిందితులను కూడా పట్టుకునేందుకు భారత్ యోచిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *