
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల అందరికి ఇళ్ళ స్థలాల తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం కోరింది. ఆదివారం నాడు సిరిసిల్లలో జరిగిన ప్రధమ కార్య వర్గ సమావేశానికి జిల్లా అధ్యక్షులు కె. భద్రాచలం అధ్యక్షత వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, ఆన్లైన్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు అయిలు రమేష్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సిరిసిల్ల జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించాలని నిర్ణహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి దాసరి దేవేందర్, కోశాధికారి కాంభోజ ముత్యం, స్టేట్ కౌన్సిల్ మెంబర్ తడుక విశ్వనాథం , ఉపాధ్యక్షుడు పురుమాని లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.