రాజనాధ్ సింగ్ తో భేటీ అయిన కడియం…

రాజనాధ్ సింగ్ తో భేటీ అయిన కడియం...

ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ విషయంపై కేంద్ర హోం మంత్రి రాజనాధ్ సింగ్ తో సమావేశమయిన రాష్ట్ర్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.

ఢిల్లీ: బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజనాధ్ సింగ్ తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన తెలంగాణ లోని ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ లేకపోవడం వలన పదోన్నతులను ఇవ్వడం లో కలుగుతున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పదోన్నతులు లేక రాష్ట్ర్రంలో ఉపాధ్యాయ వ్యవస్దలో అనేక ఖాళీలు ఉండటం వలన మానిటరింగ్ కి ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. ఏకీకృత సర్వీస్ లను తీసుకొని రావాలి అంటే రాష్ట్ర్రపతి ఆమోదం ఉండాలని, అందువల్ల హోంమంత్రిత్వ శాఖ రాష్ట్ర్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను వీలైనంత త్వరగా రాష్ట్ర్రపతి ఆమోదం కొరకు పంపాలని కేంద్ర హోంమంత్రిని కోరామని ఆయన తెలిపారు. రాష్ట్ర్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదన ఆమోదం పొందగానే ఖాలీగా ఉన్న డిప్యూటేషన్ పోస్ట్ లను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం రెండు రాష్ట్రాల ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ లకు సంబంధించి ఒకే రకమైన ప్రతిపాదన తో అమలు చేయాలని కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. కేంద్ర హోం మంత్రి ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి వెంట ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *