రాజధాని నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేవు

విజయవాడ (పిఎఫ్ ప్రతినిధి) : ఏపి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలపై చర్చ జరిగింది. ఏపి క్యాబినేట్ సమావేశానంతరం సమావేశ నిర్ణయాలను ఏపి సీఎం చంద్రబాబు విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఏపి రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా సీఎం ప్రజలను కోరారు. ఈ నెల 22న జరిగే రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు హాజరవనున్నట్లు తెలిపారు.  పోలవరం ప్రాజెక్టు ద్వారా 7 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగు నీరందించే లక్ష్యంతో  ప్రాజెక్టును పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ కు ఇప్పటి వరకు రూ.241 కోట్లు ఇచ్చామన్నారు. ఎంతో ఉత్సాహంగా ఉన్నామని తెలిపారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సింగపూర్, జపాన్ వంటి దేశాల నుంచి పలువురు మంత్రులు సైతం హాజరవనున్నట్లు తెలిపారు. అలాగే దేశంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. కేంద్రం సహాయం తీసుకుని రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాజధాని శంకుస్థాపన పనులపై గ్రీన్ సిగ్నల్ ట్రిబ్యునల్ ఎటువంటి అభ్యంతరాలు తెలపలేదని అన్నారు. రాజమండ్రి పేరును మహేంద్రవరంగా మార్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *