
కరీంనగర్ ,ప్రతినిధి : హిమాలయాల్లో ఎవరెస్ట్ వలే దేశ రాజకీయాల్లో కాకా వెంకటస్వామి ఒకరని డీసీసీ అద్యక్షులు కటకం మృత్యుంజయం అన్నారు. ఆదివారం నాడు కరీంనగర్ ఇందిరాగార్డెన్ లో డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన స్వర్గీయ వెంకటస్వామి సంస్మరణ సభను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమకుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఈ సంస్మరణ సభలో కటకం మృత్యుంజయం మాట్లాడారు.
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కాకా సుదీర్ఘ రాజకీయ జీవితం అందరికీ ఒక పాఠం లాంటిదని అన్నారు. సామాన్య కాంగ్రెస్ కార్యకర్త నుంచి దేశ రాజకీయాల్నే శాంసించే వ్యక్తిగా ఎదిగిన కాకా కాంగ్రెస్ రాజకీయ చరిత్రలో గొప్ప నాయకుడని కటకం కొనియాడారు. ఇంత గొప్ప వ్యక్తి కరీంనగర్ వాసి అయినందుకు గర్వపడుతున్నానన్నారు.