
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎన్టీఆర్ అరంగేట్రం చేసినప్పుడు ఆయనతో పాటు ప్రచారం చేసి రాజ్యసభ సభ్యుడిగా చేసిన మోహన్ బాబు అనంతరం ఎన్టీఆర్ మరణం, చంద్రబాబు టీడీపీ టేక్ ఓవర్ తో ఆయన ఇమడలేక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తదనంతర పరిణామాలతో ఆయన శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమాల్లో , విద్యారంగంలో రాణిస్తున్నారు.
ఇక ఇప్పుడు మోహన్ బాబు దృష్టి మళ్లీ రాజకీయాలపై పడింది. తిరుపతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. టీడీపీ నా, వైసీపీలోకా అన్న ప్రశ్నకు మాత్రం మోహన్ బాబు జవాబివ్వలేదు.. ఆ సంగతిని త్వరలోనే నిర్ణయిస్తానన్నారు. ఇక తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందని.. ఆయన అన్నీ నెరవేరుస్తున్నారని ప్రశంసించారు.