
జానారెడ్డి నోట వైరాగ్యం మాట వినిపించింది. ఓటుకు నోటులో రేవంత్ రెడ్డి తనకు జానారెడ్డి బంధువు అని సన్నిహిత సంబంధాలున్నాయనడం తనకు మనస్తాపానికి గురిచేసిందని జానారెడ్డి అన్నారు. తాను రాజకీయాల్లో 40 ఏళ్లు గా ఎంతో నిబద్ధతతో, నిజాయితీ ఉంటున్నానని.. కానీ తననూ ఇలా వాడుకోవడంపై జానా ఆవేదన వ్యక్తం చేశారు.
గాంధీభవన్ మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో విలువలు పడిపోయాయని రాజకీయాల్లోంచి దూరంగా వెళ్లాలనిపిస్తోందని చెప్పారు.