‘రాచకొండ’కు రాచఠీవి

-ఫార్మ, ఫిల్మ్ సిటీ ల ఏర్పాటుకు రాచకొండ భూముల కేటాయింపు
-వీటి ఏర్పాటుతో వేల మందికి ఉద్యోగాలు
-కేసీఆర్ నిర్ణయంతో సర్వత్రా హర్షం
హైదరాబాద్, ప్రతినిధి : రాచకొండ భూములు వచ్చే కొన్నేళ్లలో ప్రపంచంలో పేద్ద పారిశ్రామిక వాడలకు కేంద్రం కానున్నాయి. సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేతో రాచకొండ భూములను గుర్తించడం అక్కడ ఫార్మా, ఫిల్మ్ సిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇన్నాళ్లు ప్రపంచంలో ఇంత పెద్ద స్థాయిలో ఫార్మా కోసం భూములను కేటాయించి ఫార్మా కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచిన దాఖలాలు లేవు. కానీ సీఎం కేసీఆర్ నిర్ణయంతో ప్రపంచంలోని అన్ని పెద్ద ఫార్మా కంపెనీలు ఇక్కడ కంపెనీలు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ప్రపంచంలో (ఎఫ్ ఆర్ అండ్ డీ) – ఫార్మా రిసెర్చ్ వల్ల  చాలా తక్కవ మొత్తంలో మందులను కనిపెట్టి పరిశ్రమకు అందజేయగల్గుతాం. మ్యాన్ పవర్ కూడా ఇక్కడ తక్కువ ధరకు దొరుకుతుండడంతో ఔషధ ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. దీనివల్ల ఇక్కడి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావడమే కాకుండా.. వేలమంది ఫార్మాసిటికల్ విద్యార్థులకు, ఉద్యోగులకు భారీ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయి. ఫార్మా సిటీతో ప్రపంచంలోనే మందుల తయారీ పరిశ్రమకు తెలంగాణ కేంద్రం కానుంది. ఈ ఘనత సాధించడం ద్వారా మున్ముందు పెద్ద ఎత్తున మరిన్ని పరిశ్రమలు రావడానికి మార్గం సుగుమం కానుంది.

ఫిల్మ్ సిటీ ఏర్పాటుతో సినీరంగానికి ఊపు
ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిల్మ్ తో సినీ రంగానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ కు ఇప్పడు రాచకొండ భూముల్లో మరో ఫిల్మ్ సిటీ ఏర్పాటుతో ఇక సినిమాలకు స్వర్గధామంగా మారనుంది. దీనివల్ల వేలమంది సినీ కళాకారులకు, కార్మికులకు ఉపాధి లభించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సినీ పరిశ్రమ విశాఖ తరలిపోనుందనే వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు పూనుకోవడంతో ఇక తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ లోనే కొనసాగనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.