Breaking News

రాంచరణ్ అలా చేశారా..?

ramcharan-1000x630

హైదరాబాద్, ప్రతినిధి : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి ఇంటినుంచి అర్ధరాత్రినుంచి తెల్లవారజాము వరకు సంగీత హోరు పక్కనున్న వారిని డిస్టర్బ్ చేసింది. హీరో రామ్ చరణ్ తమ స్నేహితులైన మాజీ ఎంపీ కుమారుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకుతో కలిసి రాత్రంతా పెద్ద మ్యూజిక్ హోరుతో పార్టీ చేసుకున్నారు. ఈ సౌండ్ కు పక్కనే ఉన్న ఐపీఎస్ అధికారి గౌతంగ్ సవాంగ్ న్యూసెన్స్ చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

స్పందించిన పోలీసులు ఈ ఉదయం 4.30 చిరంజీవి ఇంటికి రాగా అప్పటికే రాంచరన్ తన ఇంటి బయట పోలీసులతో మాట్లాడి పంపించారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తానని హామీ ఇచ్చి పంపించేశారు. ఆ సమయంలో రాంచరణ్ తో పాటు నలుగురు యువకులున్నట్టు సమాచారం. మరోవైపు ఇరుగుపొరుగు వారికి తాను ఇబ్బంది కలిగించానన్న వార్తలను రాంచరణ్ ఖండించారు. తనపై వచ్చిన వార్తలు అబద్దమంటూ విలేకరులకు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *