
తెలంగాణ సీఎం ముక్కు బాగుంది అని అప్పట్లో ప్రకటించిన దర్శకుడు రాంగోపాల్ వర్మపై చాలా కేసులు నమోదయ్యాయి.. అందుకే కాబోలు ఈ రోజులు హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు..
రాంగోపాల్ వర్మ ఉదయం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. అదే సమయంలో పోలీస్ పెట్రోలిింగ్ వాహనం రావడంతో ముచ్చటపడి అందులోకి వెళ్లి కూర్చున్నారు. పోలీసులు స్టార్ డైరెక్టర్ కావడంతో వద్దనలేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ తాను అరెస్ట్ అయ్యానంటూ ట్విట్టర్ లో ఫొటో పెట్టడం కలకలం రేపింది. కానీ అది ఉత్తదే నని తేలింది. అదీ ఈ ఫొటో ముచ్చట..