Breaking News

రష్యా రెస్టారెంట్ లో పులి ఫ్రై, చిరుత కర్రీ

మాస్కో : ఎప్పుడు చికెన్ మటన్ ఇవేనా.. కాస్తా అడవి జంతువుల మాంసం దొరుకుద్దా.. అంటే శివారు దాబాల్లోకెళితే అడవి పంది, జింక, కొన్ని పిట్టల మాంసంలతో ఫ్రై చేస్తుంటారు. కానీ రష్యాలో ఏకంగా పులి, చిరుతలను చంపి ఓ రెస్టారెంట్ లో వండారట.. ఈ మాంసం తింటే పడక సుఖం అదిరిపోతుందని నమ్మంచారట.. కిలో మాంసంకు వెయ్యి పౌండ్లు, తలకాయకు రెండు వేల పౌండ్లు ధర ఫిక్స్ చేసి అమ్మకాలు మొదలు పెట్టారు. ఈ విషయం అందరినోట పాకి పోలీసుల చెవిలో పడింది. దీంతో పోలీసులు ఆ హోటల్ పై దాడి చేసి పులి తల, మాంసం, పులి చర్మాలను స్వాధీనం చేసుకున్నారు.

పులిమాంసం వండుతున్న నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఈ జంతువుల శరీర భాగాలను సంప్రదాయ ఔషధాల్లో వాడుతారని పోలీసులు చెబుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *