Breaking News

రవీంధ్రభారతిలో “ప్రపంచ తెలుగు మహాసభల” కార్యాలయం ప్రారంభించిన ఎం‌పి కవిత

IMG_20171103_011603

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ నెలలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల కార్యాలయాన్ని రవీంధ్రభారతి ఆవరణలో నిజామాబాద్ ఎం‌పి శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ప్రపంచంలో ఉన్న తెలుగువారందరు గర్వపడేలా తెలుగు మహాసభలు మన రాష్ట్రం నిర్వహిస్తుందని తెలిపారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు మహాసభల లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ్ దేశాల్లో స్థిరపడ్డ తెలుగు వారు సభలకు వచ్చేలా ప్రభుత్వ పరంగా కృషి ప్రారంభమైందని చెప్పారు. చరిత్ర, సంస్కృతి, భాష, కళల వికాసం దిశగా తెలుగు మహాసభలు ముందుకు సాగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయులతో పాటు, రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్న తెలుగు భాషాభిమానులు, కవులు, పండితులు, కళాకారులు తమ ప్రతిభను మహాసభల్లో ప్రదర్శించి సాంస్కృతిక దీప్తిని ప్రపంచం నలుమూలలా చాటాలని ఆమె పిలుపునిచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే తెలుగు మహాసభలను ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించి, ఇంటి పండుగగా నిర్వహించుకోవాలని సూచించారు. రవీంధ్రభారతి కార్యాలయం నుంచి ప్రపంచ సభల కార్యాకలాపాలు ఎప్పటికప్పుడు అందరికీ అందుబాటులో ఉంటాయని కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి.రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ డా. నందిని సిధారెడ్డి తెలిపారు.IMG_20171103_011444
కార్యక్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్ రావు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, తెలుగు విశ్వవిద్యాలయం వి‌.సి. ఆచార్య సత్యనారాయణ, తెలంగాణ బ్రీవరెజెస్ సంస్థ ఛైర్మన్ కె. దేవీప్రసాద్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయాచితం శ్రీధర్, పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి. వెంకటేశం, IAS,సాంస్కృతిక శాఖ సంచాలకులు  మామిడి హరికృష్ణ, మహేష్ గారు, కొనితెల దిలీప్, శైలజా, నవీణాచారి, తుల ఉమా, పలువురు కవులు, IMG_20171103_011405కళాకారులు, భాషాభిమానులు, సాహితీవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *