రవితేజ బర్త్ డే స్పెషల్.. కిక్ -2 టీజర్ రిలీజ్

హైదరాబాద్, ప్రతినిధి : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రూపొందిన కిక్ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. ఇప్పడు దానికి కొనసాగింపుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న కిక్ -2 మూవీ టీజర్ ను రవితేజ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే వేలల్లో హిట్స్ వచ్చాయి. కేవలం 30సెకన్ల నిడివిగల ఈ టీజర్ లో రాజస్తాన్ లోని జైసల్మీర్  లో తెరకెక్కించిన క్లైమాక్స్ సీన్లు కనిపిస్తున్నాయి.  ఈ సినిమా సినిమాటోగ్రఫీ టీజర్ లో అద్భుతంగా కనిపించింది.

రవితేజ హీరోగా రకూల్ ప్రీతిసింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.  ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28న రిలీజ్ చేయనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *