రవాణాశాఖ ఆధునీకణకు కేంద్రం నిధులు

రవాణాశాఖ ఆధునీకణకు కేంద్రం నిధులు సమకుర్చుకుందాం

ఈ నెల 8న గట్కరీ చేతికి ప్రతిపాధనలు

భవనాలు, సదుపాయాలకు 30 కోట్లు

కొత్త బస్సుల కొనుగోలుకు మరో 140 కోట్లు

రవాణాశాఖ,ఆర్టీసీ అధికారులతో బడ్జెట్ సమిక్షలో మంత్రి మహేందర్ రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 6 : రవాణాశాఖను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి అధిక నిధులను రాబట్టు కోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన 2017-18 వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. రవాణాశాఖను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో రోడ్డు భద్రత, ఆధునీకరణ, సాంకేతికతతో పాటు ప్రజా రవాణా వ్యవస్థలను మరింత అభివృద్ధి పరచేందుకు కేంద్రం నిధులను సమకూర్చుకుందామని చెప్పారు. ఇందుకు గాను అవసరమైన ప్రతిపాధనలను సిద్ధం చేయాలని రవాణా శాఖ, ఆర్టీసీ అధికారలను ఆదేశించారు.ఇందులో భాగంగా ఈ నెల 8న ఢిల్లీ పర్యటనలో కేంద్రం రవాణాశాఖ మంత్రి నితిన్ ఘట్కరితో భేటీ అవుతామన్నారు. అలాగే ఇతర మంత్రులను కలిసి పలు ప్రతి పాధనలను చేస్తామన్నారు. అలాగే రవాణా శాఖ గత ఏడాది నిర్ధేశించిన 2500 కోట్ల రాబడులతో 2150 కోట్ల ఆదాయం వచ్చిందని అయితే రానున్న ఆర్ధిక ఏడాదికిగాను 2900 కోట్ల నిధుల ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు ప్రతిపాధనలు చేసినట్లు అధికారులు వివరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంతో 51 భవనాలకు గాను 13 స్వంత భవనాలుంగా మిగితా వాటి నిర్మాణాలు, మరమత్తులు 30 కోట్ల నిధులను సమకూర్చుకోవాని అన్నారు.15 ప్రాంతాలలో రవాణాశాఖ కార్యాలయాలకు స్వంత భవనాల కోసం స్థల సేకరణ చేస్తున్న నేపథ్యంలో వాటికీ భవనాల నిర్మాణాల తో పాటు డ్రైవింగ్ ట్రాక్ లు ప్రతిపాధనలు చేయాలని సూచించారు. ఆసిఫాబాద్, పరిగి, జనగామ, పెబ్బేరు, సిద్దిపేట, రంగారెడ్డి,మల్కాపూర్, నల్లగొండ, సూర్యాపేట, బండ్లగూడలలో అసంపూర్తిగా నిలిచి పోయిన భవనాల నిర్మాణాలకు 17.81 కోట్ల నిధులకు ప్రతిపాధనలు చేశామన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థలను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం సహాయం మరింత తీసుకునేందుకు ప్రతిపాధనలు సిద్దం చేయాలని ఎండీ రమణారావుకు సూచించారు. టీఎస్ ఆర్టీసీ లో కొత్త బస్సుల కొనుగోలు కోసం 140 కోట్ల నిధులను ప్రతిపాదించారు. ఆర్టీసీలోనూ ఆధునీకరణ, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు సమకూర్చుకుందామని మంత్రి అధికారులతో అన్నారు. మొత్తానికి రవాణాశాఖ ఆధునీకరణ, ఆర్టీసీ ల పనితీరు మెరుగు పరచేందుకు అవసరమైన స్థాయిలో నిధులు కేటాయింపు ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రవాణాశాఖ ప్రిన్స్ పుల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఎండీ రమణారావు, జేటీసీ వెంకటేశం, డీటీసీ రమేష్, ఓఎస్డీలు సుధాకర్ రెడ్డి, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *