రభస రివ్యూ Movie Review

Movie Name : రభస
Censor : U/ A
Genre :లవ్ , యాక్షన్ , కామెడీ ఎంటర్టైనర్
Rating :  2/5
Casting: ఎన్టీఆర్,సమంతా,ప్రణీత,బ్రహ్మానందం..
Cinematography : శ్యామ్ కె నాయుడు
Music:  ఎస్.ఎస్.థమన్
Editor :  కోటగిరి వెంకటేశ్వరరావు
Story , Screen  play, Dialogues, Direction: సంతోష్ శ్రీనివాస్
Producers : బెల్లం కొండ సురేష్ , బెల్లం కొండ గణేష్ బాబు
Production house : శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ , శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్
Released Date :  29- 08-2014
Introduction :  ఎన్టీఆర్ ….. ఒక నటుడికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్న అరుదైన స్టార్. ఎలాంటి సీన్ లో అయినా జీవించగల నేర్పు… ఏ స్టెప్ అయినా సరే బాడీ ని మెలికలు తిప్పగల నైపుణ్యం ఎన్టీఆర్ సొంతం. తాత పోలికలతో పాటు… ఆయన ఫ్యాన్స్ …. తాత పెట్టిన పార్టీ కేడర్ … ఒక వర్గం ప్రజల అండదండలతో నెంబర్ వన్ హీరో గా ఎదుగుతాడని విశ్లేషకులు చెప్పిన హీరో. వాళ్ళ అంచనాలకు అనుగుణంగానే చిన్న వయసులోనే బాక్స్ ఆఫీసు దగ్గర భారీ హిట్స్ కొట్టిన తారక్ రీసెంట్ టైమ్స్ లో మాత్రం ఎదురు దెబ్బలు తింటున్నాడు. ప్రారంభం లో ఎంకరేజ్ చేసిన ఒక వర్గం, పార్టీ కేడర్ దూరమవుతూ ఉందని …. ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ఇంటర్నల్ గా చాలా విషయాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ రీజన్ తో పాటు మాస్ సినిమా ల జమానాలో ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించిన ఈ సింహాద్రి… మల్టిప్లెక్ష్ లు , ఓవర్ సీస్ ఎఫెక్ట్ తో ఊర మాస్ సినిమాలను కూడా క్లాస్ గా ప్రెజెంట్ చేస్తున్న ప్రజెంట్ ట్రెండ్ లో  రేసులో కొంచెం వెనకపడ్డాడు.
క్లాసు,మాసు మిక్స్ చేసిన రామయ్యా వస్తావయ్య సినిమా లో ఉన్న క్లాస్ నే ఆడియన్స్ ఇష్టపడ్డారు. ఇప్పుడు మళ్ళీ కందిరీగ లాంటి మాస్ , కామెడీ సినిమా తో హిట్ కొట్టిన సంతోష్ శ్రీనివాస్ తో కలిసి రభస చేయడానికి వస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభం నుంచి ఈ సినిమా కు సంభందించి ఏదో ఒక రభస జరుగుతూనే ఉంది. రిలీజ్ టైం లో కూడా ఆ రభస కంటిన్యూ అవుతూనే ఉంది. టైటిల్ ఎఫెక్ట్ ఏమో. ఇప్పుడు ఈ సినిమా కు ఎన్టీఆర్ ఇమేజ్ ఒక్కటే కొండంత భరోసా. మొన్ననే సికిందర్ లాంటి డిజాస్టర్ తో వచ్చిన సమంతాకి  తమిళ్ లో ఐరన్ లెగ్ ట్యాగ్ తగిలించారు. మరి ఈ తెలుగు గోల్డెన్ లెగ్ భామ రభస ను గట్టెక్కిస్తుందా? తనకు హెల్త్ బాగా లేనప్పుడు హెల్ప్ చేసిన  ఎన్టీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటాను అన్న శ్రీనివాస్ ఈ సినిమా తో ఆ ఋణం లో కొంతయినా తీర్చుకున్నాడా…?
Plot:  లాస్ట్ 10 ఇయర్స్ లో రిలీజ్ అయిన తెలుగు సినిమా లలో ప్రేక్షకులను మెప్పించిన సీన్స్ అన్నింటినీ కలగలిపి ….. ఆ సీన్స్ కోసం ఓ లైన్ తయారు చేశారు. ఇంకొన్ని క్షణాలలో పెళ్లి ఉంది అనగా ఒక అమ్మాయి లేచి పోయే ప్రయత్నాలలో ఉండగా ఈ కథ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రేమ కోసం హీరో చాలా మంది రౌడీ లతో ఫైట్ చేయడం  ఏ సంబంధమూ లేని ఓ అమ్మాయి ప్రేమ కోసం ప్రాణాలకు తెగించిన హీరో ని హీరోయిన్ ప్రేమించడం  పీటల మీద నుంచి లేచి వచ్చిన ఆ అమ్మాయి కోసం వెనకాతలే రౌడీ లతో వచ్చిన పెళ్లి కొడుకును కోమాలోకి వెళ్ళేలా హీరో ఒక్కటిచ్చుకోవడం ఆ పెళ్లి కొడుకు ఫాదర్ , బ్రదర్స్ హీరో పైన పగ బట్టడం  వాళ్ళ కొడుకును కొట్టిన హీరో ఆ తండ్రి కొడుకులను బకరాలను చేసి అదే ఇంట్లో తిష్ట వేయడం  ఇక రాయడం నా వళ్ళ కాదు గానీ మీరే ఓ సారి రెడీ సినిమా గుర్తుకు తెచ్చుకోండి. దానికి అదనంగా హీరో కి వాడి మరదలికి ఎలా అయినా పెళ్ళిచేయాలని చూసే ఓ అమ్మ కథను యాడ్ చేస్తే   ఈ పాయింట్ లు అన్నీ తిప్పి తిప్పి వెనకకు ముందుకు   కలగలిపి పాత సినిమా లు గుర్తు రాకుండా చెప్పటానికి ట్రై చేస్తే అదే రభస.
Performance: ఎన్టీఆర్ ……. డాన్సులు , ఫైట్ లతో పాటు ఏ ఎమోషన్ అయినా ….. ఏ డైలాగ్ అయిన పర్ఫెక్ట్ గా పెర్ఫొర్మ్ చేయగల స్టార్ . ఈ విషయం లో స్టార్స్ అందరిలోకి ఎన్టీయారే నెంబర్ వన్. ఈ సినిమా లో కూడా చాలా ఎనర్జిటిక్ గా తన టాలెంట్ మొత్తం చూపించాడు. చాలా కష్టపడి చేశాడు. కానీ సీన్స్ లో కథ లో ఆ స్థాయి దమ్ము లేకపోవడం తో ఆ కష్టం వేస్ట్ అయింది. సమంతా ఐటెం గర్ల్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా అందాలు ఆరబోసింది. అమ్మడికి యాక్టింగ్ చేయటానికి స్కోప్ లేదు. ప్రనీతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని చేసేశారు. ఇద్దరు హీరోయిన్ లకు ఇంపార్టెన్స్ లేదు. ఇక మిగతా వాళ్ళందరూ …. సేం ఇలాంటి క్యారెక్టర్ లనే లాస్ట్ 10 ఇయర్స్ గా చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో బానే చేశారు.
Technical  : కథ లేకపోయినా సినిమా లు హిట్ అవుతున్నాయి కదా అని ఎట్ లీస్ట్ లైన్ కూడా లేకుండా అన్ని సినిమా ల నుంచి సీన్స్ ఎత్తుకొచ్చిన శ్రీనివాస్ కన్విన్సు చేయడం లో వరస్ట్ గా ఫెయిల్ అయ్యాడు. థమన్ మ్యూజిక్ సినిమా కు మైనస్. డైలాగ్స్ కూడా బాగా లేవు. ఎడిటింగ్ బాగా లేదు.
Highlights :
ఈ సినిమా కు ప్లస్ పాయింట్స్ అన్నీ ఎన్టీఆర్ ఒక్కడే
                                  ఎన్టీఆర్ ఎనర్జీ
వరుస ఫ్లాప్స్ వస్తున్నా కాన్ఫిడెన్సు కోల్పోకుండా నటుడిగా బెటర్ పెర్ఫార్మన్స్ చేస్తూ ఉండడం
 సాంగ్ కూడా చాలా బాగా పాడాడు
Drawbacks  :
 సంతోష్ శ్రీనివాస్
 ఎన్టీఆర్ ఎనర్జీ ని ఎలివేట్ చేసే కథ లేకపోవడం
 సీన్స్ లో దమ్ము లేకపోవడం
 వరస్ట్ స్క్రీన్ ప్లే
Analysis:  సినిమా చూసిన వాళ్ళకు వచ్చే ఫస్ట్ థాట్. ఎన్టీఆర్ లాంటి హీరో కి హిట్ ఇచ్చే డైరెక్టర్ ఎవరు. అన్ని విధాలుగా కూడా బెస్ట్ క్వాలిటీస్ ఉన్న ఎన్టీఆర్ కథలు జడ్జ్ చేయడం లో  డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకోవడం లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు. హిట్ ఇచ్చిన డైరెక్టర్ ల వెంట పడడం ఎప్పుడు మానేస్తాడు అనే. తన వరకూ అన్నీ చాలా బాగా చేస్తున్న ఈ హీరో కథలు సెలెక్ట్ చేసుకోడం లో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. స్టార్ హీరో భారీ చిత్రాల నిర్మాత  టాప్ హీరోఇన్స్  టాప్ టెక్నీషియన్స్అన్నీ ఉండి కూడా సంతోష్ శ్రీనివాస్ ఏమీ చేయలేకపోయాడు. కొన్ని కామెడీ సీన్స్ మినహాయిస్తే చెప్పుకోదగ్గ ఇంకో విషయం ఏదీ సినిమా లో లేదు. విషయం ముందుగా తెలుసు కాబోలు  ప్రొడ్యూసర్ తో సహా ఎవరూ కూడా ఈ సినిమా ను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. పాపం ఎన్టీఆర్  చాలా ప్లస్ లు ఉండి కూడా  ఎక్కడో ప్లానింగ్ దెబ్బ తిని ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నాడు.
Bottom Line : ఎన్టీఆర్ కోసమే చూడాలి ఈ ఎన్టీఆర్ సినిమా

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.