రబి సాగుకు అన్ని చెరువుల నుండి నీరు ఇవ్వాలి: మంత్రి టి.హరీష్ రావు

కరీంనగర్: రాష్ట్ర్రంలో విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, ప్రాజెక్టులు నిండినందున రబిలో పంటల సాగుకు రైతులకు నీరు ఇవ్వాలని రాష్ట్ర్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. గురువారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో భూ సేకరణ, మిషన్ కాకతీయ రబి కార్యాచరణ ప్రణాళికలపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెరువుల నుండి రబిలో రైతులకు నీరు ఎప్పటి నుండి విడుదల చేయాలో షెడ్యూలు తయారు చేసుకోవాలని ఆదేశించారు. మీడియా మేజర్ ప్రాజెక్టుల నుండి ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో నీరు విడుదల చేయాలని సూచించారు. ఈ పద్దతి పాటిస్తే నీరు ఆదా అవుతుందని పంటలు కూడా బాగా పండుతాయని అన్నారు. లిఫ్టు ఇరిగేషన్ క్రింద కూడా సాగుకు నీరు అందడం లేదని రైతులు అంటున్నారని ఈ సారి ఒక ప్రాజెక్టు క్రింద చివరి ఆయకట్టుకు ముందుగా దగ్గరి భూములకు తర్వాత నీరు ఇచ్చి ఫలితాలను తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖ ద్వారా చెరువుల విస్తీర్ణం క్రింద ఆయ కట్టు వివరాలు సేకరించి రికార్డు చేయాలని చెరువుల, ఆయకట్టుల మ్యాపులు తయారు చేయాలని సూచించారు. అన్ని జిల్లాలలో జిల్లా ఇరిగేషన్ ప్రణాళికలు తయారు చేసి పంపాలని అన్నారు. మిషన్ కాకతీయ క్రింద జరిగిన పనులను ధర్డు పార్టీ పరిశీలిస్తుందని వారికి కలెక్టర్లు సహకరించాలని సూచించారు. నీటి పన్ను వసూళ్లలను పెంచాలని అన్నారు. మిషన్ కాకతీయ మూడవ విడతలో గతంలో తెగిపోయిన, నీరు లేని చెరువులు, గొలుసు కట్టు చెరువులు ఫీడర్ ఛానెల్ నిర్మాణాలకు ప్రతి పాదనలు తయారు చేసి పంపాలని సూచించారు. మిషన్ కాకతీయ మూడవ విడత ప్రతి పాదనలు నవంబర్ నెలాఖరులోగా పంపాలని ఇరిగేషన్ ఇంజనీర్లను ఆదేశించారు. వీటిని పరిశీలించి డిసెంబర్ లోగా మంజూరు చేస్తామని, జనవరి నుండి జూన్ మొదటి వారంలోగా పనులు పూర్తి చేయవచ్చునని తెలిపారు. ప్రాజెక్టుల భూసేకరణ 2013 యాక్టు ప్రకారం సేకరించాలని, రైతులు ముందుకు వస్తే 123 జి.ఒ. ప్రకారం త్వరగా భూసేకరణ చేయాలని అన్నారు. అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లతో పెండింగ్ పనులపై సమీక్షించారు. ఈ కాన్ఫరెన్సులో కరీంనగర్ సిరిసిల్ల కలెక్టర్లు సర్పరాజ్ అహ్మద్ కృష్ణభాస్కర్ జె.సి లు బి.శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *